Agripedia

మైక్రో ఇరిగేషన్ కల్టివేషన్ గురించి పూర్తి వివరాలు

KJ Staff
KJ Staff

వ్యవసాయ పరిస్థితులు కాలానుగుణంగా వృద్ధి చెందుతు వస్తున్నాయి. ఒకప్పటితో పాలిస్తే నేడు ఎన్నో కొత్త ఆవిష్కరణలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వ్యవసాయంలో ఉపయోగించడం ద్వారా పంట దిగుబడి పెరగడంతో పాటు ప్రకృతి వనరులను కూడా కాపాడుకోవచ్చు. మైక్రో ఇరిగేషన్ వంటి పద్దతులు నీటి వృధాని తగ్గించి లాభాలను పెంచే దిశగా పనిచేస్తాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్నలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి అడుగులు వేయాలి. సంప్రదాయ పద్దతులని వీడి ఆధునిక వ్యవసాయాన్ని, అవలంభించడం ద్వారా, సేద్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు. వ్యవసాయంలో నీరు ప్రధాన పాత్రపోషిస్తుంది. నీరు లేనిదే వ్యవసాయం లేదు, ఇటువంటి అమూల్యమైన నీటిని జాగ్రత్తగా వాడుకోవడం మన బాధ్యత, వర్షాధారంగా పంటలున్ పండించే ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ప్రతినీతి బొట్టును వినియోగించుకోవాలి.

కానీ నీటి వినియోగం పై సరైన అవగాహనా లేనందువల్ల అవసరానికంటే ఎక్కువ నీటిని వినియోగిస్తూ మనమంతా నీటిని వృధా చేస్తున్నాం. నీటి వృధాలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది, 70% కంటే ఎక్కువ మంచి నీరు వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నాం, దీనిలో కొంత శాతం మాత్రమే పంట ఎదుగుదలకు ఉపయోగపడుతూ మిగతా నీరు మొత్తం వృధాగా పోతుంది. నీటి వృధా అధికమవుతూ నేటి నీటి కష్టాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితీ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉంటుంది.

వ్యవసాయంలో నీటి వృథాను తగ్గించడంలో మైక్రో ఇరిగేషన్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. సూక్ష్మ సాగు ద్వారా మొక్కకు అవసరమైన నీటిని సరైన సమయంలో, అందిస్తూ అధిక దిగుబడులు పొందవచ్చు. దీనిలో ముఖ్యమైనది డ్రిప్ ఇరిగేషన్(బిందు సేద్యం). డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని నేరుగా మొక్క వేరు వ్యవస్థకు అందించవచ్చు.

మొక్క ఎదుగుదలకు అవసరమైన నీటిని లేటరల్ పైపుల ద్వారా, ప్రెషర్ తో పైపులైన్ల ద్వారా, బొట్టు బొట్టుగా నీటిని అందించాడన్ని బిందుసేద్యం అంటారు. డ్రిప్ సిస్టం ద్వారా అందించిన నీరు నేరుగా వేరువ్యవస్థకు అందుతుంది, దీని వలన నీటి మొక్కల నీటి వినియోగ సామర్ధ్యం 90-95% కి పెరుగుతుంది. డ్రిప్ పద్దతిని, కాయగూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు మరియు సుగంధద్రవ్యాలు మొక్కల సాగుకి వినియోగిస్తారు. ఈ పద్ధతి ద్వారా మరొక్క ఉపయోగం ఏమిటంటే, నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ పైపుల ద్వారా మొక్కకు నేరుగా అందించవచ్చు.

మైక్రో ఇరిగేషన్ లో స్ప్రింక్లర్ ఇరిగేషన్ ను మరొక్క చక్కటి పద్దతిగా పరిగణించవచ్చు. ఈ స్ప్రింక్లర్లు వర్షం లాగానే నీటిని మొక్కలకుపై వెదజల్లుతాయి. ఈ పద్ధతిని ప్రధాన పొలంలో లేదా పోలీహౌస్ లో పంటలు పండించేవారు వినియోగించుకోవచ్చు. ఈ పద్దతిని ఆకుకూరల సాగులో, కొన్ని కూరగాయలు, పళ్ళ సాగులో వినియోగించుకోవచ్చు. స్ప్రింక్లర్ పద్దతిలో నీరు పైపుల ద్వారా ప్రవహించి, పైపుల పైన అమర్చిన స్ప్రింక్లర్ల ద్వారా నీటిని తుంపర్లుగా వెదజల్లుతుంది. డ్రిప్ పద్థతితో పోలిస్తే ఈ పద్దతిలో మరింత ఎక్కువ ప్రెషర్ తో నీటిని నీటిని అందించాలి.

ఐతే ఈ పద్ధతులన్నీ కొంత ఖర్చుతో కూడుకున్నవి. ఈ పద్దతులను విస్తరింప చేసి, వీటిని అమర్చుకున్న రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలను అందిస్తుంది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, ఓసీ బీసీ రైతులకు 90% రాయితీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. ఈ మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అవలంభించాలకున్న రైతులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine