Agripedia

"అగ్రి ఫెర్రో సొల్యూషన్స్" వారి తక్కువ ఖర్చు అధిక ప్రభావవంతమైన లింగాకర్షక బుట్టలు !

KJ Staff
KJ Staff
Agri Phero Solutionz
Agri Phero Solutionz

అగ్రి ఫేరో సొల్యూషన్స్ (ప్రోటెక్స్టింగ్ క్రాప్‌ క్రీఎటింగ్ లైఫ్) అనేది భారతదేశం యొక్క ప్రీమియం నాణ్యత మరియు క్రిమి ఫెరోమోన్ ఎరలు, వాటికి తగిన ట్రాప్‌ల యొక్క విశ్వసనీయ తయారీదారులు.ఎంతోమంది రైతన్నలకు సేంద్రీయ వ్యవసాయం వైపు నడవడానికి సహాయపడింది. అనుభవజ్ఞులైన యువ ఎనర్జిటిక్ అగ్రి నిపుణుల బృందంతో 2014 సంవత్సరంలో APS స్థాపించబడింది. మా ఉత్పత్తులు తెగుళ్లను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడతాయి మరియు సకాలంలో నియంత్రణ చర్యలు తీసుకోవడంలో పెంపకందారులకు సహాయపడతాయి. అవి ఉత్పత్తిపై అనవసరంగా పురుగుమందులు మరియు హానికరమైన రసాయనాలను పిచికారీ చేయడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

వ్యవసాయ మరియు ఉద్యాన పంటలలో ముఖ్యంగా మిరప, టమాటా , బొప్పాయి,పెసలు, మినుములలో  రసం పీల్చే పురుగులు ,తెల్లదోమ, పేనుబంక, దీపపు మరియు  తామరపురుగులు ఆశించడం వల్ల వైరస్‌, తెగుళ్ళు వ్యాప్తి చెంది పంటకు అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

వీటి నివారణకు రైతులు వివిధ రకాల పురుగుల మందులను ఎక్కున మోతాదులో వాడడం వలనపెట్టుబడులు పెరగడమే కాకుండా పర్యావరణ కాలుష్యం పంట ఉత్పత్తులలో రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎగుమతికి నిరాకరింపబడి విదేశీ మారక ద్రవ్యాన్ని రైతులు గడించలేకపోతున్నారు .ఈ చీడపీడల నివారణకు మరియు రైతుకు సాగు ఖర్చు తగ్గించే దిశగా సమగ్రసస్యరక్షణ పద్ధతులలో భాగంగా అత్యుత్తమ నాణ్యత కలిగిన పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను  మరియు జిగురు రోల్స్‌ను ఉత్తమ నాణ్యత వివిధ పరిమాణాలలో రైతులకు తక్కువ   ధరలో "అగ్రి ఫెర్రో సొల్యూషన్స్" అందుబాటులోకి తెచ్చింది.

జిగురు అట్టలు అంటే ఏమిటీ?

కూరగాయల మరియు పండ్ల తోటల్లో  ముఖ్యంగ బ్యాక్టీరియా మరియు వైరస్ తెగుళ్ల ను ప్రధానంగ తెల్ల దోమ,కొన్ని మిడతలు మొక్కలపై వాలి  గుడ్లుపెట్టడం ద్వారా ఈ  తెగుళ్ళకు ప్రధాన వాహకాలు గ ఉంటాయి . వీటి  యొక్క ఉద్ధృతిని  పంటలలో నిర్మూలించ గలిగితే దాదాపు చాల రకాల  తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించు కోవచ్చు.అయితే వీటినీ అరికట్టడానికి కి   జిగురు అట్టలు ఉత్తమంగా పనిచేస్తాయి.  జిగురు అట్టలు అనగా  మొక్కలపై వాలే ఈగలు , తెల్ల దోమ, పెను బంక ,మిడతలు, తామర పురుగులు మరియు పంటను నాశనం చేసే ఇతర పురుగులను ఆకర్షిస్తాయి.ఈ పురుగులు వివిధ  రంగులకు ఆకర్షితం అవుతాయి, వీటిలో ప్రధానంగా  పసుపు రంగు మరియు నీలి రంగు జిగురు అట్టలు ఉనికిలో ఉన్నాయి.

పసుపు మరియు నీలంరంగు జిగురు అట్టలు:

ఈ జిగురు అట్టలు  ప్రకాశవంతమైన పసుపు, తెలుపు, నీలం రంగులో వుండి రెండు వైపుల పురుగులను ఆకర్షించే జిగురువ్రాసి ఉండటం వల్ల, పురుగులు వీటి మీద ఆకర్షింపబడి వాలినప్పుడు అతుక్కొని, తిరిగి ఎగరలేక చనిపోతాయి. జిగురు ఎరల వల్ల రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ మరియు తెగుళ్లను తగ్గించవచ్చు.ఈ జిగురు ఎరలు ముఖ్యంగా పంటలలో ఎలాంటి పురుగుల ఉదృతి ఎక్కువగా ఉందో  గమనించి వాటిని అరికట్టే నివారణ చర్యలు తీసుకోవడంలో,తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవడానికి ఉపయోగపడతాయి.రైతులు వీటిని సమగ్ర సస్యరక్షణ పద్దతులలో భాగంగా  ఉపయోగించి ఖర్చు తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం కొరకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు ను సందర్శించండి .

http://www.agripherosolutionz.com/

 

Agri Phero Solutions
Agri Phero Solutions

లింగాకార్షక బుట్టలు :

మామిడి తోట, సపోట, బత్తాయి, జామకాయ, పుచ్చకాయ, నిమ్మకాయ, దానిమ్మ పండు, సొరకాయ, బీరకాయ, దొండకాయ, పొట్లకాయ, కాకరకాయ, దోసకాయ, కీర, చిక్కుడు కాయ, గుమ్మడి కాయ, ఖర్బుజా లో లింగాకార్షక బుట్టలు.

పండ్ల రారాజు మామిడి ఉత్పత్తి లో మన దేశం మొదటి స్థానంలో ఉంది. అనేక దేశాలు మన మామిడిని దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ మామిడి సాగులో పండు ఈగ విపరీతమైన నష్టాన్ని కలుగ జేస్తుంది. ఇది ముఖ్యంగా  మామిడి గుజ్జును ఆశిస్తుంది. దీనిని నివారించడానికి రసాయన మందులు వాడితే పండు నాణ్యత దెబ్బ తింటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అగ్రి ఫెర్రో సొల్యూషన్స్ వారు అందిస్తున్న లింగార్షక బుట్టలు పండు ఈగని ఎదుర్కోవడంలో మంచి ఫలితాలను చూపించింది.ఈ పండు ఈగ వల్ల దాదాపుగా 30 శాతం దిగుబడి నీ కోల్పోయే ప్రమాదం ఉంది. APS వారి మాక్స్‌ఫిల్ ట్రాప్,  మిస్టర్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లూర్ మరియు మిస్టర్ మెలోన్  ఫ్లై ట్రాప్ లూర్ లను వాడి పంటలను, తోటలను పండు ఈగ దాడి నుండి కాపాడుకోవచ్చు.

కొబ్బరి తోట, ఆయిల్ పామ్, ఖర్జూరం లో ఎర్ర ముక్కు మరియు కొమ్ము పురుగు నివారణ:

కొబ్బరి తోటలో ఎర్ర ముక్కు పురుగు పీడ ఏడాది పొడవునా సంభవిస్తుంది. అయితే దీని తాకిడి   వర్షాకాలం ప్రారంభంతో జూన్ - సెప్టెంబరులో అత్యధికంగా ఉంటుంది. కొబ్బరి తోట 10 నుండి 15% దిగుబడిని కోల్పోయి రైతులకు నష్టం చేకూరుస్తుంది.అయితే కొబ్బరి తోటలో రసాయన మందుల పిచికారీ నిర్వహణ చాల కష్టంతో కూడుకున్నది కాబట్టి ఇలాంటి సమయాల్లో లింగాకర్షక బుట్టలను వాడి ఈ పురుగుల నివారణ సులభం చేసుకోవచ్చు

 లింగాకార్షక బుట్టతో నివారించ గలిగే  పురుగులు:

వరి  పంటలో వచ్చే కాండం తొలుచు పురుగు, పత్తిని నాశనం చేసే కాయ తొలుచు పురుగు, గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న ,కంది, జొన్న, వేరుశనగ, టమాటా మరియు పొగాకు లో వచ్చే శనగ పచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగులను కూడా నివారించవచ్చు.

మరింత సమాచారం కొరకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు ను సందర్శించండి .

http://www.agripherosolutionz.com/

 

Agri Phero Solutionz
Agri Phero Solutionz

ల్యూర్‌ అంటే ఏమిటి?

పురుగు యొక్క ఉదరం నుంచి వెలువడే సహజసిద్ధమైన వాసన కలిగిన పదార్థాలను ఫిరమోన్లు అంటారు. పురుగులు లైంగిక సంపర్కం

కోసం లేదా ఒకదానికి ఒకటి సమాచారం చేరవేసుకోవడానికి వీటిని విడుదల చేస్తాయి.అగ్రి ఫెర్రో సొల్యూషన్స్  ఈ ఫిరమోన్లను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసి, ల్యూర్‌ డిస్పెన్సర్లో ఉంచే విధంగ  రైతులకు మంచి  నాణ్యత అతి తక్కున ధరలో అందుబాటులోకి తీసుకొని వచ్చింది.వీటిని ల్యూర్‌ అంటారు.

మరింత సమాచారం కొరకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు ను సందర్శించండి .

http://www.agripherosolutionz.com/

Agri Phero Solutionz
Agri Phero Solutionz

Share your comments

Subscribe Magazine