Agripedia

అమృతవల్లి సాగు... లాభాలు బహు బాగు!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు వారి పంట పొలాల్లో వరి, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేస్తున్నారు.ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ విధమైనటువంటి పంటలను ఎంపిక చేయటం వల్ల పంటలకు మార్కెట్లో పెద్దగా డిమాండ్ కలిసిరాదు. అయితే అందరూ పండించిన మాదిరిగా కాకుండా కొత్తగా పండించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. కృష్ణా జిల్లా, నూజివీడు మండలం, రాట్నాల గూడేనికి చెందిన రైతు మరియదాసు .

అందరూ వరి జొన్నలు గోధుమలు పండిస్తే వాటి ద్వారా వచ్చే బీపీ, షుగర్ వంటి వ్యాధులను నయం చేయడానికి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. ఇంతకీ ఆ మొక్క ఏంటో తెలుసా.. అదే అమృతవల్లి.ఈ అమృతవల్లి మొక్కలను తిప్పతీగలు అని కూడా పిలుస్తారు. ఈ తిప్పతీగలలోఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల దీనిని గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇన్ని ఔషధ గుణాలు దాగిఉన్న ఈ మొక్కలను సాగు చేయాలని భావించిన రైతుకు మొదటి దశలోనే తీవ్ర నిరాశ ఎదురైంది.

ఈ విధంగా తీగ జాతికి చెందిన మొక్కలను నేలపై పాకటం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది కనుక ఈ తీగలను సాగు చేయాలంటే పందిళ్ళు వేసి సాగు చేయడంతో మంచి లాభాలు పొందవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పంటకు పందిళ్ళు వేయడానికి ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడంతో కట్టెల ద్వారా పందిళ్లను నిర్మించి సాగుచేస్తున్నారు.

ఈ విధంగా ఒక్కో మొక్క సుమారుగా 15 కిలోల వరకు దిగుబడి అందిస్తుందని ఈ సందర్భంగా రైతు మరియదాసు తెలియజేశారు. కేవలం 60 సెంట్లలో నాటిన మొక్కలకు 30000 పెట్టుబడి పోగా లక్ష రూపాయల వరకు లాభం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. మొక్కలను సాగు చేయడానికి వర్షం పడిన పడకపోయినా ఇది పండుతుంది.ఈ తిప్పతీగలో ఉండే పోషకాలు మన శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడ్డాయి. దీర్ఘకాలిక వ్యాధులు అయిన కీళ్లనొప్పులు, కీళ్లలో మంట తగ్గుతాయి. శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగించడానికి కాలేయానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులోఅదుపులో ఉంచుతుంది ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ అమృత వల్లిని సాగు చేయడం ద్వారా లాభాలు పొందవచ్చునని రైతులు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine