కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన చర్చల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో తిరిగి చేరాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అభినందించారు. ఈ కీలక నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని 40 లక్షల మందికి పైగా రైతుల పంటలకు ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు బీమా సౌకర్యం లభిస్తుంది.
రాష్ట్రాల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనని సులభతరం చేసిందని శ్రీ తోమర్ చెప్పారు. రైతుల స్థితిగతులను మెరుగుపరచడానికి, వారు అభివృద్ధి చెందడానికి, వ్యవసాయాన్ని అధునాతన వ్యవసాయంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి నిరంతరం కృషి చేస్తోంది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో ఈ పధకాన్ని మళ్లీ అమలు చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో చర్చించిన తర్వాత రాష్ట్రంలోని రైతులకు పీఎంఎఫ్‌బీవై కింద పంటల బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్ర ముఖ్యమంత్రి తెలిపారు.
ఖరీఫ్-2022 సీజన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు వారి ఆదాయ-జీవనోపాధిని కల్పించడం ద్వారా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ (స్వయం-ఆధారమైన భారతదేశం) స్వావలంబన గల రైతుల కలలను సాకారం చేయడం ద్వారా వారి సాధికారతకై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
భూమి, చంద్రుడు మరియు అంగారక గ్రహాన్ని కనెక్ట్ చేస్తే రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల సూచనలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి-2020లో రైతులందరికీ స్వచ్ఛంద నమోదు, దిగుబడి అంచనా వివరాల కోసం సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం, మొత్తం చెల్లింపు కోసం భీమా కవరేజీ వంటి కొత్త ప్రయోజనాలు ఎంచుకోవడానికి ఈ పథకాన్ని పునరుద్ధరించింది. ప్రస్తుత విధానం ప్రకారం అదనంగా పరిపాలనా ఖర్చుల కోసం 3% కేటాయింపులతో ఇప్పటి వరకు ఎంపిక ఐన రాష్ట్రాలకు భీమా వర్తింప చేశారు
జూలై 7న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా నేతృత్వంలోని బృందం కూడా ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రికి వివరాలు సమర్పించింది.
PMFBY మరియు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (RWBCIS) ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్-2016 నుండి ఖరీఫ్-2019 వరకు విజయవంతంగా అమలు అయ్యింది.
Share your comments