Government Schemes

ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు వైద్య సాయం .. ఎలాగంటే?

Srikanth B
Srikanth B
Rs. 5 lakh medical aid with Ayusman card
Rs. 5 lakh medical aid with Ayusman card

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపడతుంది అందులో ఒకటి ఆయుస్మాన్ భారత్. ఈ కార్యక్రమం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా లభిస్తుంది . మెడికల్ బిల్లులు కట్టలేని పేదల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది . ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, ప్రతి కుటుంబానికి ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది.. ఇప్పుడు ఈ పథకం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఈ పథకం కింద చికిత్స పొందుతున్న వ్యక్తి ఆస్పత్రి ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నప్పుడే దీనికి అర్హులు అవుతారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెప్పవచ్చు..ఈ పథకం కింద 10.74 కోట్ల కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది..

తెలుగు రాష్ట్రాలలో రానున్న వారం రోజుల పాటు వర్షాలు .. హై అలర్ట్ జారీ !

ఆయుస్మాన్ కార్డును ఎలా పొందాలి?
ముందుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి..
అక్కడ మీ పేరు జాబితాలో ఉందో లేదో అధికారులు తనిఖీ చేస్తారు.
ఆయుష్మాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు నమోదు అయి ఉంటే మీరు కార్డు పొందుతారు.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి అన్ని పత్రాలు
ఫొటో కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో సదరు అధికారికి సమర్పించాలి.
తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు.
రిజిస్ట్రేషన్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను అందిస్తారు.
మీ ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మీకు కార్డు వస్తుంది.

భూమి, చంద్రుడు మరియు అంగారక గ్రహాన్ని కనెక్ట్ చేస్తే రైల్వే లైన్

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More