Agripedia

అల్ల నేరేడు సాగులో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు...!

KJ Staff
KJ Staff

ఎన్నో ఔషధగుణాలు, పోషక విలువలు సమృద్ధిగా ఉన్న అల్ల నేరేడు పండ్లు తొలకరి వర్షాలు ప్రారంభమై రెండు మూడు వారాల మాత్రమే లభ్యమయ్యే సీజనల్ ఫ్రూట్స్.ఈ పండ్లకు పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో వీటికి మార్కెట్ లో అధిక ధర లభిస్తోంది .దీంతో చాలా మంది రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే అల్ల నేరేడు సాగు చేయడానికి ఆసక్తి చూపి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నేరేడు పండ్లు ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ ను బట్టి 100 నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతోంది.

అల్లా నేరేడు సాగుకు అన్ని రకాల నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయానికి పనికిరాని ఉప్పు లేదా చౌడు నేలలు, నీళ్లు నిలిచే సమస్యాత్మక భూముల్లో సైతం వీటి సాగును చేపట్టవచ్చు. అల్ల నేరేడు సాగులో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ పండ్లను ప్రాంతాలను బట్టి జంబూ ఫలం,రాజా జామున్ వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.

సస్యరక్షణ చర్యలు :

అత్యధిక కరువు పరిస్థితులు సైతం తట్టుకొని జీవించే మొక్క కాబట్టి వీటికి చీడపీడల సమస్య తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పూత, కాయ ఏర్పడే దశలు అవసరమైన మేరకే సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొక్కలకు ఎక్కువగా ఆశించే కాండం తొలుచు పురుగు , ఆకులు తినే పురుగు , ఆకుచుట్టు పురుగు , తెల్లదోమ , పండు ఈగ , ఆకుమచ్చ , కాయమచ్చ తెగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు అవసరాన్ని బట్టి క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి మరియు కార్బండైజిమ్‌ లీటరు నీటికి 1గ్రాము లేదా 3గ్రాముల డైథేన్‌ ఎం-45 కలిపిన ద్రావణంతో మొక్క మొత్తం తడిసేలా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు.

ఎరువులు యాజమాన్యం:

నేరేడు మొక్కలకు ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. వాణిజ్య శైలిలో పెంచుతున్నప్పుడు జూన్ జులై నెలలో తగిన పరిమాణంలో ఎరువులు వాడినట్లయితే అధిక దిగుబడులు సాధించ వచ్చు కాపుకొచ్చిన ప్రతి చెట్టుకు 75 కిలోల పశువుల ఎరువు ,1.3 కిలోల యూరియా , 1.5 కిలోల సూపర్ ఫాస్ఫేట్ , అరకిలో పొటాష్ ఎరువులను వేయాలి.నేరేడు కాయల పిందెలు వృద్ధిచెందే దశలో యూరియా లీటరు నీటికి 10 గ్రా + ఫార్ములా -4 లీటరు నీటికి 3గ్రా కలిపిన పిచికారి చేయడం వలన కాయ సైజు అధికంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine