Agripedia

కాకర సాగుకు అనుకూలమైన విత్తన రకాలు, విత్తన శుద్ధి ప్రాముఖ్యత...!

KJ Staff
KJ Staff

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్న
కాకరకాయకు మార్కెట్లో సంవత్సరం పొడవునా స్థిరమైన ధర లభిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో రైతులు కాకరపంట సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. సాధారణంగా కాకరను అన్ని కాలాల్లోనూ సాగుచేయవచ్చు. కాకర నాటిన రోజు నుంచి 60-65 రోజులకు కాపు నిచ్చే స్వల్పకాలిక పంట అయితే జూలై,ఆగస్టు నెలల్లో కాకరకాయలను మార్కెట్లకు తరలించే విధంగా నాటుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.

చలికాలం ప్రారంభమయ్యే జనవరి, ఫిబ్రవరి నెలలో కాకర సాగు చేసినట్లయితే వ్యాధుల తీవ్రత తక్కువగా ఉండి అధిక నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. నేల స్వభావము నాటుకునే విధానాన్ని బట్టి ఎకరానికి 800 గ్రాముల నుండి ఒక కిలో కాకర విత్తనాలు సరిపోతాయివిత్తనాలను 1 లేదా 2 సెం.మీ. లోతులో ఉండునట్లు నాటుకోవాలి

ఈ కాకరకాయ మొక్కలు నాటేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య 2 నుంచి 4 అడుగుల దూరం,వరుసల మధ్య 14 అడుగులు దూరం ఉండునట్లు నాటుకోవాలి. కాకరకాయ తీగ జాతికి చెందిన కూరగాయ కాబట్టి దీన్ని శాశ్వత పందిరి నిర్మాణంలో సాగు చేస్తే చీడపీడల సమస్య తక్కువగా ఉండి అధిక కాయ
దిగుబడిని పొందవచ్చు.

విత్తన రకాల :

విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు మన ప్రాంత వాతావరణానికి, నెలలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.కాలానుగుణంగా మార్కెట్లో లభ్యమయ్యే అధిక దిగుబడినిచ్చే సూటి, హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక దిగుబడి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత మార్కెట్లో చాలా రకాల అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాచుర్యం పొంది అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న విత్తన రకాలు కోయబత్తూర్ లాంగ్ , మహికో గ్రీన్ ల్యాండ్ , గ్రీన్, ఆర్మ హరిత వంటివి.

విత్తనశుద్ధి ప్రాముఖ్యత :

విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున ధైరమ్ మరియు 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒక తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించే అనేక రకాల వైరస్, బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టవచ్చు. వేరుకుళ్లు సమస్యలు ఎక్కువగా ఉన్న నేలల్లో 100 గ్రా. విత్తనానికి 2 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వేరుకుళ్లు తెగులుని అరికట్టవచ్చు

Share your comments

Subscribe Magazine