Agripedia

చిక్కుడులో వచ్చే ఆకుమచ్చ తెగులు-నివారణ చర్యలు..?

KJ Staff
KJ Staff
Broad Bean
Broad Bean

తీగజాతి మొక్కలైన చిక్కుడు పంటను అనేక రకాల చీడపీడలు ఆశిస్తుంటాయి. కాబట్టి రైతులు ఈ పంట సాగు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పంట దిగుబడి తగ్గి నష్టాలను మిగిల్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. చిక్కుడుకు వచ్చే ప్రధాన తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు ఒకటి.  ఇది పలు రకాల శీలింద్రాల వల్ల సంక్రమిస్తుంది. ముఖ్యంగా సెర్కొస్పోరా కానసేన్స్ రకం శీలింద్రం పంటపై అధిక ప్రభావం చూపడంతో పాటు ఇది మట్టిలో దాదాపు రెండు సంవత్సరాల వరకు పంట అవశేషాలపై జీవించగలుగుతుంది. కాబట్టి చిక్కుడు సాగు చేసిన తర్వాత అదే పంట పొలంలో మరో వేసిన తర్వాతి పంటపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ. భూమిలో ఉన్న ఈ ఆకుమచ్చ తెగులును కలుగజేసే శీలింద్రం తనకు అనుకూలంగా ఉండే వాతావరణం ఏర్పడిన వెంటనే పంటపై దాడి చేస్తుంది.

మొదటగా మొక్కల కింది భాగాల నుంచి మొక్క మొత్తం వ్యాపిస్తాయి. ఇది గాలీ, నీరు ద్వారా వ్యాప్తి చెందుతూ.. పంట మొత్తంగా విస్తరిస్తుంది. ఈ తెగులు కారణంగా చిక్కుడు మొక్కల ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇవి లేత పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. నీటిలో ఆయా రంగులను ముంచితే ఎలా ఉంటాయో.. ఆకులపై కూడా ఆవిధంగా వచ్చలు కనిపిస్తాయి.  సాధారణంగా ఆకు మచ్చతెగులుకు కారణమయ్యే శీలింద్రం.. మొక్కలు మూడు నుంచి ఐదు వారాలకు చేరిన తర్వాత ఆశిస్తాయి. మొదట చిన్నగా ఏర్పడుతున్న మచ్చలు.. తర్వాత పెద్దగా మారుతాయి.  దీని వల్ల ఆకులు రాలడంతో పాటు.. మొక్కలు బలహీన పడతాయి. ఆకుమచ్చ తెగులు ప్రభావం అధికంగా ఉంటే పంట పూర్తిగా నాషనం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా పంట పూతకు వచ్చే దశతో పాటు కాయలు కాస్తున్న సమయంలో ఈ తెగులు సోకుతుంది.

చిక్కుడు ఆకుమచ్చ తెగులు నివారణ: ఆకువచ్చ తెగులును తట్టుకునే విత్తన రకాలను సాగు చేయాలి. అలాగే,  శీలింద్ర నాషన రసాయనాలను పంటపై పిచికారీ చేసుకోవాలి. చిక్కుడులో ఆకు మచ్చ తెగులు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఒక గ్రామ్ చొప్పున లీటరు నీటితో కలిపి కోరో తలోనిల్ ను పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు అనేక రకాల శీలింద్ర నాశన పంట రసాయనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ నిపుణుల సలహామేరకు వాటిని ఉపయోగించుకోవాలి.

Related Topics

Broad Bean Farming Cultivation

Share your comments

Subscribe Magazine