Agripedia

రైతులకు అధిక లాభాలు అందించే ఆముదం సాగు.. ఎలా చేయాలంటే?

KJ Staff
KJ Staff
Castor Crop Cultivation
Castor Crop Cultivation

నూనే గింజల పంట సాగుకు వల్ల రైతులకు అధికంగా లాభాలు వస్తాయి. వర్షాకాలంపై ఆధారపడి సాగు చేసే  నూనే గింజల పంటల్లో ఆముదాలు ఒకటి.  ఆముదాలను తెంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో అధికంగా  సాగు  చేస్తారు. ప్రస్తుతం కాలంలో ఆముదాల సాగు రైతులకు మంచి లాభదాయక పంటగా మారింది. అలాంటి ఆముదాల సాగు ఎలా చేయాలో వ్యవసాయ నిపుణులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆముదం సాగు చేయు విధానం: ఆముదం వర్షాధార పంట.  తేలికపాటి నేలలు, గట్టి నేలలు, ఏర్రనేలలు సహా అన్నిరకాల నేలలలో సాగు  చేయవచ్చు. విత్తనాలు నాటే ముందు పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు చదునుగా దున్నుకోవాలి. పొలాన్ని దున్నే సమయంలోనే ఒక ఎకరం పొలానికి మూడు టన్నుల వరకు పశువుల పేడ వేసుకోని దున్నుకోవాలి. దీని వల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది. విత్తనాలు రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జులై నేలాఖరు వరకు నాటుకోవచ్చు. ఒక ఎకరం పొలానికి అధిక దిగుబడినిచ్చే సాధారణ రకాలైతే రెండు నుంచి మూడు కిలోల ఆముద విత్తనం అవసరం అవుతుంది.  అదే హైబ్రీడ్ విత్తనాలు అయితే రెండున్నర నుంచి మూడు కిలోల విత్తనాలు ఎకరం పొలానికి సరిపోతాయి.  విత్తనాలు నాటే ముందు థైరమ్ లేదా కార్బెండిజమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని వల్ల భూమిలో ఉంటే చీడపీడలు విత్తనాలు ఆశించకుండా ఉంటాయి. మొలక శాతం సైతం అధికంగా ఉంటుంది.

విత్తనాలను శుద్ధి  చేసుకున్న తర్వాత వాటిని నాటుకోవాలి. విత్తనాలు విత్తే రెండు వరుసల మధ్య దూరం దాదాపు 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి. రెండు మొక్కల మధ్య దాదాపు 60 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. విత్తన రకాలను బట్టి ఈ లెక్కలు మారుతాయి.  ప్రస్తుతం మార్కెట్ లో అరుణ, క్రాంతి, జ్యోతి, జ్వాల, కిరణ్‌, హరిత, జీసీహెచ్-4, డీసీహెచ్-32, డీసీహెచ్-117, జీసీహెచ్-5 ఆముదం రకాలు మంచి ఆదరణ పొందాయి.  ఇందులో 90-150 రోజుల్లో కొతకు వచ్చే రకాలు కూడా ఉన్నాయి. వర్షాధార అనిశ్చితి పరిస్థితులు అధిగమించడానికి పెసర, గోరు చిక్కుడు వంటి వాటిని అంతర పంటలుగా ఆముదలో సాగు చేయవచ్చు.

Share your comments

Subscribe Magazine