Agripedia

మిరప పంటలో వచ్చే తెగుళ్లు.. నివారణ పద్ధతులు?

KJ Staff
KJ Staff

సాధారణంగా మిరప పంటను ఖరీఫ్ సీజన్లో అయితే జులై,ఆగస్టు నెలలో సాగు చేస్తారు.
రబీ సీజన్లో అయితే అక్టోబర్, నవంబర్ నెలలో సాగుకు అనుకూలం .సేంద్రీయ పదార్థం అధికంగా ఉన్న అన్ని రకాల నెలల్లో మిరప సాగు చేపట్టవచ్చు. ఉదజని సూచిక 6 - 6.6 ఉన్న నేలలు చక్కటి అనుకూలం.మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే 10 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం చక్కటి అనుకూలంగా చెప్పవచ్చు.మిరపసాగులో అధిక దిగుబడులు సాధించడానికి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.

తెగుళ్ళు నివారణా పద్ధతులు:

బూడిద తెగులు : ఆకులపై తెల్లటి బూడిద రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు హెక్సాకోనజోల్ 2 మి.లీ/లీ. లేదా డైనోక్యాప్ 2 మి.లీ./లీ.నీటిని కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

నారుకుళ్ళు తెగులు : నారుమడి పెంపకానికి ఎత్తైన నారుమడులు వేసుకోవడం మంచిది. లేకపోతే నీరు నిలిచి లేత మొక్కల మొదలు మెత్తబడి చనిపోతుంది. దీని నివారణకు మొదట విత్తనాలకు థైరం లేదా కాప్టాన్ 3 గ్రా./ కిలో విత్తనానికి విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధితో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా./లీ కలిపి నారుమడి తడిచేలా పిచికారి చేయాలి.

ఎండు తెగులు: మొక్కలు ఎదిగే కొద్ది మొక్కల కాండం లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారి మొక్కలు, ఆకులు పూర్తిగా వడలిపోయి క్రిందకు రాలుతాయి.దీని నివారణకు మొదట విత్తనశుద్ధిలో ట్రైకోడెర్మా విరిడే 4గ్రా./కి. విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
నత్రజని, నీటి తడులు తగ్గించాలి.కాపర్ ఆక్సిక్లోరైడ్3 గ్రా. /లీ.నీటికి కలిపి మొక్కల మొదళ్ళు కలిసేలా చేయాలి

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More