Agripedia

ఇలా వ్యవసాయం చేస్తే 30 ఏళ్ల తర్వాత అన్నం దొరకదు.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన నిపుణులు!

KJ Staff
KJ Staff

భారతదేశం జనాభా పరంగా ఎంతో పెద్ద దేశం అని చెప్పవచ్చు. అయితే మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఆహారం కోసం పండించే పంటలు వరి పంటకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే దేశ ప్రజలు సైతం ఎక్కువగా వరి నుంచి తయారు చేసుకున్న అన్నం పై ఆధార పడటం వల్ల మన దేశంలో వరిపంట సాగుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో వరి పంట సాగు కొంతమేర తగ్గిందని చెప్పవచ్చు. రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో వరిపంట సాగు తగ్గితే రాబోయే కాలంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడించారు.

అమెరికాకి చెందిన ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు మనదేశంలో వరి పంట సాగు పై పలు పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల ఆధారంగా వరిసాగులో చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాల వల్లనే వరి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. ఇలాంటి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ వరిపంటను సాగుచేస్తే రాబోయే 30 సంవత్సరాలలో మనకు ఆహారం దొరకడం చాలా కష్టం అవుతుందని నిపుణులు తెలియజేశారు.

బిహార్ లోని బొర్లాగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సౌత్ ఏషియాలో భాగంగా ఉన్న వ్యవసాయ భూమిలో వీరు పరిశోధనలు చేశారు. 2050 వ సంవత్సరం నాటికి దేశంలో వరిపంటను సాగుచేయడానికి ఎంతమేర నీటి లభ్యత ఉంటుంది,రాబోయే వాతావరణంలో మార్పులకు అనుగుణంగా రైతులు ఏ విధంగా పంటలు పండించాలనే విషయాన్ని గురించి నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా వరిపంటలో అధిక దిగుబడి రావడానికి ఉష్ణోగ్రతలు, వర్షపాతం, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వరిపంట పండటానికి అధిక ప్రాధాన్యత వహిస్తాయని తెలిపారు.

సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకకిలో వరిపండడానికి సుమారు నాలుగు వేల లీటర్ల నీరు అవసరం అవుతుందని నిపుణులు వెల్లడించారు. వరి పంటలో అధిక దిగుబడులు పొందాలంటే రైతులు పొలంలో ముందుగా వేసిన పంటలు వ్యర్థాలను అలాగే దుక్కిదున్నడం వల్ల నేల సారవంతం తగ్గిపోకుండా ఉంటుంది. అదేవిధంగా కోత సమయంలో వృధా అయ్యే ధాన్యాలను కాపాడుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. చాలా మంది రైతులు పంట కాలాన్ని నిర్ణీత సమయానికి తగ్గించడం వల్ల అధిక నాణ్యత కోల్పోతుంది. ఈ క్రమంలోనే పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ విధమైనటువంటి పొరపాట్లు చేయటం వల్ల రాబోయే 30 సంవత్సరాలలో మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆహారం దొరకడం ఎంతో కష్టతరంగా మారుతుంది అని పరిశోధనల ఆధారంగా తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More