భారతదేశంలో మొక్కజొన్న పంట చాల ప్రధానమైనది. వరి మరియు గోధుమ తరువాత మొక్కజొన్న మూడవ అతి ముఖ్యమైన ఆహార వాణిజ్య పంటగా ఉంది. ఎక్కువగా మొక్కజొన్నను ఉత్తర భారతదేశంలో బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో అధికంగా పండిస్తారు. ఈ మొక్కజొన్న పంటలో 'కత్తెర పురుగు' అనే చీడపురుగు ముఖ్యమైనది. ఈ పురుగు మొక్కజొన్న పంటను ఆశించడం వలన పంట దిగుబడి తగ్గిపోతుంది. దీని వలన మొక్కజొన్న పంట వేసిన రైతులు అధికంగా నష్టపోతున్నారు. ఈ కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం మరియు దాని లక్షణాలను తెలుసుకుని, నియంత్రణ పద్ధతులు పాటించినట్లయితే నష్టాల బారి నుంచి బయటపడవచ్చు.
మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు యొక్క లార్వా ఆకులను మరియు కాండాన్ని తింటుంది. ఈ మొదట దశ లార్వాలు ఆకు యొక్క పై పొరను తింటాయి. దీనివలన ఆకులపై తెల్లని పోర అనేది ఏర్పడుతుంది. తరువాత ఈ లార్వాలు ఆకుల యొక్క అంచులను తినడం వలన అవి కత్తిరించినట్లుగా ఉంటుంది. ఈ లార్వా యొక్క రెండు మరియు మూడో దశలలో ఆకును గుండ్రంగా ముడిచి తినడం ప్రారంభిస్తాయి. ఏవిధంగా తినడం వాలన ఆకులపై వరుసగా రంద్రాలు ఏర్పడతాయి. పూర్తిగా ఎదిగిన కత్తెర పురుగులు మొక్క యొక్క ఆకులను మొత్తం తినడం వలన కేవలం కాండం మాత్రమే మిగులుతుంది.
కత్తెర పురుగు యొక్క జీవిత కాలం అనేది ఒక నెల నుండి మూడు నెలల వరకు ఉంటుంది. వీటిలో ఆడ పురుగులు వాటి గుడ్ల సముదాయాలను ఆకు యొక్క కింది బాగాన పెడుతుంది. ఇంచుమించుగా ఒక ఆడ రెక్కల పురుగు వచ్చేసి 1000 నుండి 2000 వేల గుడ్లను పెడుతుంది. 6 దశల్లో ఈ పరుగు యొక్క ఎదుగుదల ఉంటుంది.
ఇది కూడా చదవండి..
పురుగుల మందుల పిచికారీ సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..
ఈ కత్తెర పురుగు నియంత్రణకు విత్తడానికి ముందు ఈ జాగ్రత్తలను తీసుకోవాలి. కత్తెర పురుగు యొక్క ప్యుపాలు భూమిలో నిద్రావస్ధ దశలో ఉంటాయి. ఈ ప్యుపాలను నియంత్రించడానికి విత్తనాలు వేసే ముందు నాగలి లేదా ట్రాక్టర్ తో పొలాన్ని దున్నుకోవాలి. ఇలా చేయడం వలన నిద్రావస్ధ దశలో ఉన్న ప్యుపాలు సూర్యరశ్మికి గురై చనిపోతాయి. పొలంలో ఎటువంటి కలుపు మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. విత్తడానికి 24 గంటలు ముందుగా విత్తనాలను సయంట్రానిలిప్రోల్‌థయామిథాక్సమ్ కేజి మొక్కజొన్న విత్తనానికి 4 మి.లీ. చొప్పున విత్తనశుద్ధి చేసుకోవాలి. తద్వారా పంటను 15 నుంచి 20 రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఒకవేళ జీరో టిల్లేజ్ లో మొక్కజొన్న వేసుకున్నట్లయితే, ఒక హెక్టారుకు 500 కేజీల వేప పిండిని వేసుకోవాలి.
ఒక ఎకరానికి ఐదు లింగర్షక బుట్టలను పెట్టి పురుగు తీవ్రతను తగ్గించుకోవాలి. ఈ లింగర్షక బుట్టలను పైరుకు ఒక అడుగు పైన అమర్చుకోవాలి. మొదట 30 రోజుల వరకు లేత మొక్కజొన్నలో ఎకరానికి 10 నుండి 15 లింగర్షక బుట్టలను పెట్టాలి. మొక్కజొన్న పంట బాగా పెరిగి, పురుగు యొక్క ఉద్రిక్తతను తగ్గించడానికి నత్రజని 80-96 కిలోలు, భాస్వరం 32 కిలోలు, పోటాష్ 32 కిలోల చెప్పున ఎకరానికి వాడాలి.
ఇది కూడా చదవండి..
పురుగుల మందుల పిచికారీ సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..
పొలంలో ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను కనుక గమానించినట్లయితే వాటి నివారణకు అజాధిరక్టిన్ 5మీ.లి లీటరు నీటికి కలిపి పొలంలో పిచికారీ చేయాలి. ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి రెండో దశ లార్వాల నివారణ కొరకు పిచికారీ చేయాలి. ఉధృతి 5-10% ఉంటే, బ్యాసిల్లాస్ తూరింజెనిసిస్ 2 గ్రా. లీటరు నీటికి సాయంకాలం వేళలో పిచికారీ చేయాలి.
ఇది కూడా చదవండి..
Share your comments