Agripedia

పంటను నాశనం చేసే నులిపురుగులు, యాజమాన్య పద్ధతులు ఇవే!

KJ Staff
KJ Staff

రైతులకు వ్యవసాయ పంటల సాగులో అధిక దిగుబడులు, లాభసాటి ఆదాయం రావాలంటే పంట సంరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు చాలా కీలకం. సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే దిగుబడి తగ్గి.. రైతులు నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే రైతులు పంటను ఆశించే అనేక రకాల చీడపీడల గురించి అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. కూరగయాలు, వివిధ రకాల పంటలతో పాటు తోటల్లోనూ ప్రధానంగా రైతులు ఎదుర్కొనే సమస్యల్లో నులిపురుగుకు సంబంధించినవి ఒకటి. నులిపురుగుల వల్ల పంటలపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

నులిపురుగులు బాహ్య లక్షణాలు గమనిస్తే.. ఖండీభవనం లేకుండా శరీరం పోడవుగా, స్థూప ఆకారాన్ని పొలి ఉంటుంది. ఇవి 5-100 మైక్రాన్ల మందంతో 0.1 నుండి 2.5 మిల్లీ మీటరు పొడవులో ఉంటాయి. మెలాయిడాగైన్ జాతికి చెందిన ఈ జీవులు అనేక రకాల పంటలను ఆశించి.. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి పంటలను ఆశించడం వల్ల సాగు పంటలు, వివిధ రకాల పండ్ల తోట మొక్కలు వాడిపోయి... చివరకు ఎండిపోతాయి. మొదటగా, మొక్కలకు ఎన్ని పోషకాలు అందించిన పెరుగుదల సరిగ్గా ఉండదు. మొక్క కొమ్మలు, లేత చిగుర్లు వాడిపోయి.. రాలిపోతుంటాయి. ఆకులు సైతం రంగు మారుతూ.. పసుపు రంగులోకి చేరుతాయి. రాలిపోతుంటాయి. పూత, పిందే రాలడంతో పాటు మొక్కల వేర్లు కుళ్లిపోతుంటాయి. దీంతో మొక్క బలహీనపడ్డ లక్షణాలు కనిపిస్తాయి. అధికంగా వేరుశనగ జామ, కనకాంబరం వంటి పంటల్లో నులిపురుగుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎండు తెగులు లక్షణాలు సైతం కనిపిస్తాయి.

నులిపురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే పొలం సిద్ధం చేసే సమయంలో నేలను లోతుగా దున్నుకోవాలి. పంటల మార్పిడి చేయడం వల్ల కూడా నులిపురులు లేకుండా పోతాయి. నులిపురుగులను తట్టుకునే విత్తన రకాలను సాగు చేసుకోవాలి. నేలలో కార్బోప్యూరాన్ గులికలు వేసుకోవడం వల్ల కూడా నులిపురుగులను నివారించవచ్చు. పండ్ల తోటల మొక్కలు నాటుకునే ముందు గుర్తింపు ఉన్న నర్సరీల నుంచే మొక్కలను సేకరించుకోవాలి. అంటు మొక్కలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. మొక్కలు నాటుకునే ముందు ఆకులు వాడిపోయి పసుపు రంగులోలేని, వేర్లపై బొడిపెలు లేని మొక్కలను మాత్రమే నాటుకోవడం ఉత్తమమని వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine