Agripedia

మొక్కజొన్న పంటకు వివిధ దశల్లో ఆశించే పురుగులు, నివారణ చర్యలు..!

Srikanth B
Srikanth B

మన రాష్ట్రంలో మొక్కజొన్నను ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో విస్తారంగా సాగు చేస్తూ అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు.ఖరీఫ్ సీజన్ లో జూన్ మొదటి వారం నుంచి జూలై 15వరకు అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు. రబీ సీజన్లో అయితే అక్టోబర్ 15 నుంచి జనవరి 15వరకు విత్తుకోవచ్చు మొక్కజొన్నలు ఎకరాకు 7 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది.మురుగు నీటి సౌకర్యం ఉండి అధిక సేంద్రియ పదార్థం గల మధ్యస్థ నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలం నేల ph 6.6 నుండి 7.5 వరకు ఉన్న నేలల్లో అధిక దిగుబడులు సాధించ వచ్చు.మొక్కజొన్న సాగు వివిధ దశల్లో పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండి రైతులను అధికంగా నష్టపరుస్తాయి. మొక్కజొన్నలో వివిధ దశల్లో ఆశించే పురుగులు వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సస్యరక్షణ చర్యలు:

గులాబి రంగు పురుగు:ఎక్కువగా రబీ సీజన్లో పంటను ఆశిస్తుంది.దీని లార్వాలు ఆకుల మీద పత్రహరితాన్ని తినడం వలన ఆకులు పలుచగా తయరవుతాయి. కాండంలో గుండ్రని లేక 'యస్' ఆకారంలో ఉండే' సారంగాలను గమనించవచ్చు. ఈ పురుగులు ఆశిస్తే మొక్క మువ్వ చనిపోతుంది. పురుగుల నివారణకు ఎండోసల్ఫాన్ 2.0మి.లీ లీటరు నీటికి కలిపి 10-20 రోజుల పైరు మీద పిచికారి చేసి అవసరమైతే మరల 15రోజుల వ్యవధి తర్వాత పిచికారి చేయాలి.ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే రెండోసారి ఎండోసల్ఫాన్ పిచికారి చేసే బదులు కార్బోఫ్యురాన్ 3శాతం లేదా కార్బోఫ్యురాన్ 3శాతం లేదా ఎండోసల్ఫాన్ 4శాతం గుళికలను ఎకరాకు 3కిలోల చొప్పున ఆకు సుడులలో వేసి ఈ పురుగులను నివారించవచ్చు.

 

రసం పీల్చే పురుగులు : 30రోజుల పైబడిన మొక్కజొన్న పంటను నల్లి,పేనుబంక ఆశిస్తాయి.వీటి తల్లి పిల్ల పురుగులు మొక్కజొన్న ఎదిగే భాగాల నుంచి,ఆకులనుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు లేత పసుపురంగుకు మారి,మొక్కలు గిలసబారిపోతాయి.ముఖ్యంగా ఈ పురుగులు తేనెలాంటి జిగురును విడుదల చేసి శిలీంధ్రాలు ఉత్పత్తిఅయ్యేందుకుదోహదపడతాయి.తద్వారా తెగుళ్ళు సోకుతాయి. పురుగు నివారణకు అవసరాన్ని బట్టి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా డైమిదోయేట్ 2మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా. లిటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది.

"వరి సేకరణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత" -అమిత్ షా

కాండం తొలుచు పురుగు : ఈ పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోతుంది. కాండాన్ని చీల్చిచూస్తే లార్వాలు మరియు ఎర్రటి కుళ్ళిపోయిన కణజాలం కనిపిస్తుంది. ఈ పురుగు పంట 30 రోజుల దశనుండి పంటకోసే దశ వరకు ఆశిస్తుంది. దీని నివారణకు విత్తిన 30-35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల -కార్బోప్యూరాన్ 3జి, గుళికలను కాండం సుదులలో వేయాలి.

కత్తెర పురుగు: ఈ పురుగు ఆశించినప్పుడు లార్వాలు మొదట పత్రహరితాన్ని  తినుట వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. తర్వాత సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. పురుగు విసర్జించిన పసుపు పచ్చని గుళికలను సూడులలో గమనించవచ్చును. నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క సుధులలో పిచికారి చేయాలి. ఎరిగిన లార్వాల నివారణకు విషపు ఎర (ఎకరానికి 10 కిలోల తాడు + 2 కిలోల బెల్లం + 100 గ్రా. థయోడికార్స్) మొక్క సుదులలో వేసుకోవాలి.

వరి సాగు లో "పోలీఫీడ్ మరియు మల్టి K" (MULTI K) ఎరువుల ప్రత్యేకత ఏమిటి

Share your comments

Subscribe Magazine