Agripedia

ప్రకృతి సేద్యంతో నల్లబియ్యం సాగు.. నల్ల బియ్యం ప్రయోజనాలు ఎన్నో!

KJ Staff
KJ Staff

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న బియ్యం రకాలలో నల్లబియ్యం ఒకటి. చాలామంది నల్ల బియ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నల్ల బియ్యం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుండటంతో ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే నల్లబియ్యం ఏ విధంగా సాగు చేస్తారు. నల్ల బియ్యం ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను గురించి తెలుసుకుందాం...

గత రెండు సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాలో నల్ల బియ్యాన్ని ఎక్కువగా సాగుచేస్తున్నారు. కేవలం అర ఎకరాతో మొదలైన ఈ సాగు ప్రస్తుతం 30ఎకరాల వరకు కొనసాగుతోంది. సాధారణ వరి మాదిరి కాకుండా ప్రకృతి సేద్యం ద్వారా నల్ల బియ్యం సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఈ నల్ల బియ్యం జిల్లాలో బంటుమిల్లి మండలం తుమ్మిడి, ఆగిరిపల్లి, గూడూరు, పిల్ల జింక వంటి మండలాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. నల్ల బియ్యంలో కూడా కర్పుకవని, బర్మా బ్లాక్, కాలాభట్‌ వంటి రకాలను సాగు చేస్తున్నారు.

నల్లబియ్యంలో అధిక మొత్తంలో ఆంకోసైనిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులు వంటి రోగాలను నియంత్రిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి నల్లబియ్యం ఎంతగానో దోహదపడతాయి.
విటమిన్‌–బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం ఐరన్ 24 ఇందులో పుష్కలంగా లభిస్తాయి. నల్లబియ్యం లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇది కణాలను కూడా శుభ్రపరుస్తుంది.

Share your comments

Subscribe Magazine