Agripedia

పీతల సాగు... విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

KJ Staff
KJ Staff

సాధారణంగా ఆక్వా రైతులు పీతల సాగు చేస్తూ ఎంతో ఆదాయాన్ని ఆర్జిస్తారు. అయితే పీతల సాగు చేసే రైతులు ఎన్నో జాగ్రత్తలు మెలకువలు పాటించినప్పుడే వారికి సరైన దిగుబడి వస్తుంది.ఈ సాగు విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన రైతులు పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ క్రమంలో పీతల సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ముందుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి విత్తనాల ఎంపికలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం...

పీత విత్తనాల ఎంపికలోనే నాణ్యమైన పీతల సాగు ఆధారపడి ఉంటుంది. ఈ విత్తనాలని ఎంపిక చేసుకొనేటప్పుడు రైతులు సరైన వయస్సు, సరైన పరిమాణం ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఈ పిల్ల పీతల రంగు ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉండేలా వాటిని ఎంపిక చేసుకున్నప్పుడే అధిక దిగుబడిని పొందవచ్చు. విత్తనాలు ఎంపిక విషయంలో వీటికి కాళ్ళు, డేక్కలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకొని ఎంపిక చేసుకోవాలి.

పీత పిల్లలను ఎంపిక చేసుకొనేటప్పుడు ఎక్కువ వ్యత్యాసం ఉన్న వాటిని ఎంపిక చేసుకోవటం వల్ల పెద్ద సైజులో ఉండే పీతలు ఎంపిక చేసుకోవడం వల్ల చిన్నపిల్లలను తినేస్తాయి కనుక రైతులకు దిగుబడి తగ్గుతుంది. ఈ పీత పిల్లలను రవాణా చేసేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రత వద్ద రవాణా చేస్తాము కనుక వీటినీ చెరువులో వదిలే ముందు నీళ్లు ఉన్నటువంటి పెద్ద ప్లేట్లలో వదిలి కొంత సమయం పాటు ఉంచి సాధారణ ఉష్ణోగ్రత వద్దకు చేరుకోగానే వాటిని చెరువులో వదలటం వల్ల పీతలు పెరుగుదల సక్రమంగా పెరిగి అధిక దిగుబడిని పొందవచ్చు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం వల్ల ఆక్వా రైతులు పీతల సాగులో అధిక లాభాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine