Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఇచ్చే సపోటా సాగు..?

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో రైతులు ఉద్యానవన పంటల పై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ విధంగా పండ్లతోటల పెంపకానికి రైతులు ఆసక్తి చూపడంతో ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహిస్తూ వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను అత్యంత తక్కువ ధరలకే రైతులకు చెల్లించి ఉద్యానవన పంటలను పెంచడానికి రైతులకు ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే రైతులు ప్రతి ఏటా అధిక మొత్తంలో పండ్ల తోటలను సాగు చేయడానికి మక్కువ చూపుతున్నారు.

ముఖ్యంగా కొల్లాపూర్, నాగర్ కర్నూల్,కర్నూల్, కర్నూల్, వనపర్తి తదితర పట్టణాల్లో ఎర్రని భూములు నీటి సదుపాయం లేక బీడుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించే స్పీకర్లు డ్రిప్ ద్వారా రైతులు పండ్ల తోటలను సాగు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏకంగా 560 ఎకరాలలో సపోటాలను సాగు చేస్తున్నారు.

సపోటా పంటను సాగుచేసే రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. ఈ పంటలను సాగు చేయడం వల్ల చీడ పురుగుల బెడద తక్కువగా ఉంటుంది.అదేవిధంగా ఈ చెట్లు అధిక దిగుబడిని ఇవ్వడంతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. సపోటా పండ్లలో ఎక్కువ భాగం కాల్షియం, విటమిన్లను శరీరానికి అందిస్తాయి.

సపోటా పంట తేమతో కూడిన ఉష్ణమండలపు పంట.
గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ ఈ పంట పండుతుంది. కేవలం మంచి నేలలో మాత్రమే కాకుండా ఇసుక భూములు, చౌడు భూములు కూడా ఈ పంటను సాగు చేయడానికి పనికి వస్తాయి. ఈ మొక్కలను ఎకరాకు సుమారుగా 40 చెట్ల వరకు నాటవచ్చు. ఒక్కో చెట్టుకు సుమారు పది అడుగుల దూరం వెడల్పుతో నాటాలి. ఈ విధంగా సపోటాను సాగు చేయడం వల్ల రైతులు అధిక దిగుబడిని, లాభాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More
MRF Farm Tyres