Agripedia

మిర్చి పంట కోసం అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి “డిసైడ్" విడుదల చేసిన ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్

KJ Staff
KJ Staff
Dhanuka Agritech Limited launched “Decid” the most powerful insecticide for chilli crop
Dhanuka Agritech Limited launched “Decid” the most powerful insecticide for chilli crop

మిర్చి పంటను ఆశించే పురుగులు కీటకాలు పెరిగిపోతున్నాయి , ఈ కీటకాలు ఆశించడం ద్వారా దిగుబడి భారీగా తగ్గుతుంది దీనిని అధిగమించడానికి ధనుకా వారు మిర్చి పంట కోసం అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి “డిసైడ్" విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి డా॥ జి.యమ్.వి ప్రసాదరావు గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, లాం ఫాం, సీనియర్ డి.జి.యమ్ షేక్ హుస్సేన్ వలి గారు, డి.జి.యమ్ డా|| యమ్. పరశురామయ్య గారు (డెవలప్మెంట్ డి.జి.యమ్), మండిపాడు పరిసర గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

నల్లి, తామరపురుగు, తెల్లదోమ వంటి కీటకాలపై రైతులకు నియంత్రణ రావడంలో డిసైడ్ సాయపడుతుంది. మిత్సుషి కెమికల్స్ జపాన్ భాగస్వామ్యంతో “డిసైడ్” ను భారతదేశానికి ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ తీసుకువచ్చింది.

గుంటూరు, సెప్టెంబర్ 11, 2022, భారతదేశంలో సుప్రసిద్ధ పురుగుమందుల కంపెనీలలో ఒకటైన ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ అత్యంత శక్తివంతమైన కీటక సంహారి “డిసైడ్” (DECIDE) అనే పురుగుమందును దక్షిణ భారత దేశంలో విడుదల చేసింది. ఈ అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి మిర్చి పంటలో రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయడంతో పాటుగా రైతులకు నల్లి పురుగు, తామరపురుగు, తెల్లదోమ వంటి కీటకాలపై ఒకే పిచికారి స్ప్లే తో రైతులకు నియంత్రణ అందించటంలో తోడ్పడుతుంది.

“డిసైడ్" ఒక వినూత్నమైన పురుగుమందు. డిసైడ్ ఏకరీతి చర్య కలిగిన రెండు పురుగు మందుల కలయిక. డిసైడను మిత్సుషి కెమికల్స్ జపాన్ మరియు ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పరస్పర సహకారంతో భారత్ ఉపఖండంలోకి తీసుకుని వస్తుంది. డిసైడ్ ఒక అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి. డిసైడ్ నీటిలో కరిగే గుళికల రూపంలో లభ్యమవుతుంది.

మిరప పంటను సోకే రసం పీల్చు పురుగులపై అత్యంత సమర్థవంతంగా పనిచేయటంతో పాటు, రైతులకు మిరప పంటను సోకే నల్లి, తామరపురుగు మరియు తెల్లదోమల బెడద నుండి ఒకే పిచికారితో కాపాడుతుందని మరియు ఇతర పురగు మందులను కలపాల్సిన అవసరం లేదని ఈ డిసైడ్ ఉత్పత్తిని విడుదల చేసిన అనంతరం ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, షేక్ హుస్సేన్ వలి మరియు డా|| పరశురామయ్య గారు తెలిపారు.

ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ గతంలో ఉత్తర, తూర్పు మరియు పశ్చిమ భారతదేశాలలో 9(3) మాలిక్యూల్ రూపంలో విడుదల చేసింది. దేశంలో మిర్చిపంట దిగుబడి 67% ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో రైతులు సాధిస్తున్నారు. వీరు ఇటీవల నూతన కీటకం నల్లి, తామర పురుగు కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కీటకాన్ని 2020లో ఎర్ర మిరప పంటలో తొలిసారిగా తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లో గుర్తించారు. ఈ కీటక సంతతి 2021లో గణనీయంగా పెరిగింది. ఈ కీటకం కారణంగా మిరపమొక్కలో పుష్పించే దశపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ కారణంగా అది ఫలవంతం కాకుండా పోతుంది. ఈ కారణంగా పూలు రాలిపోవటం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడమూ జరుగుతుంది. తాజాగా డిసైడ్ కీటక నాశిని ప్రభావాలను గురించి ఆయన మరింత వివరంగా వెల్లడిస్తూ సరైన మొత్తంలో, సరైన నాణ్యత కలిగిన సరైన కీటకనాశినులను వినియోగించడంతో పాటుగా తగిన సమయంలో వాటిని వాడటమూ అత్యంత కీలకం. అప్పుడే పంట తగిన రీతిలో ఎదగడంతో పాటుగా కీటకాల నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. ధనుకా కంపెనీ సాంకేతికంగా అత్యంత వైవిధ్యమైన ఉత్పత్తులను కంపెనీ విడుదల చేయడం ద్వారా రైతులు తమ పంటను కాపాడుకునేందుకు మరియు దిగుబడులను పెంచుకునేందుకు తోడ్పడుతున్నాయి.

ఇటీవలనే "కార్నెక్స్” మరియు “జనెట్” లను సైతం ధనుకా అగ్రిటెక్ సంస్థ విడుదల చేసింది. పెద్ద ఆకులు కలిగిన కలుపు మొక్కలు నియంత్రణతో పాటుగా మొక్కజొన్న పంటలో చిన్న ఆకులతో కూడిన కలుపు మొక్కలు, తుంగ (సైపరస్ రొటండస్) నియంత్రణకు కార్నెక్స్ ఉపయోగపడుతుంది. ఫంగిసైడ్, మరియు బ్యాక్టిరిసైయ్ వినూత్న సమ్మేళనం. జనెట్, టమోట పంటలో అత్యంత క్లిష్టమైన తెగుళ్ళను ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. మహెన్నతమైన పరిశోధన, అభివృద్ధితో పాటుగా పలు యు.యస్, జపాన్, యూరోపియన్ వ్యవసాయ రసాయన కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుని ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ ప్రస్తుతం 80 పైగా ఉత్పత్తులను మార్కెట్లో అందిస్తుంది.

'కోర్టెవా విత్తన శుద్ధిలో అత్యాధునిక సాంకేతికతను ప్రారంభించనుంది': డాక్టర్ ప్రశాంత పాత్ర

ధనుకా గ్రూప్ కంపెనీ గురించి:
భారతదేశంలో సుప్రసిద్ధ పంట రక్షణ కంపెనీలలో ఒకటి ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ గ్రూప్. బి.యస్.ఇ మరియు ఎన్.ఎస్.ఇ లలో ఇది లిస్ట్ చేయబడిరది. ఈ కంపెనీ గుజరాత్, రాజస్థాన్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మూడు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 39 వేర్‌హౌస్లు, 6500లకు పైగా డిస్ట్రిబ్యూటర్లు మరియు 75వల మంది డీలర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. యు.యస్, యూరప్లలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యవసాయ రసాయన కంపెనీలతో అంతర్జాతీయ భాగస్వామ్యం ఇది కలిగి ఉంది. దీనిద్వారా భారతీయ వ్యవసాయ క్షేత్రాలలో అత్యాధునిక సాంకేతికత పరిచయం చేసేందుకు సైతం ఇది సాయపడుతుంది.
ధనుకా యొక్క సిబ్బందిలో 1000 మందికి పైగా టెక్నో కమర్షియల్ సిబ్బంది ఉన్నారు. వీరికి శక్తివంతమైన ఆర్ అండ్ డి విభాగం మద్దతునందిస్తుంది. దీనితోపాటుగా విస్తృతస్థాయి పంపిణీ నెట్ వర్క్ తమ ఉత్పత్తులు మరియు సేవల ద్వారా దాదాపు ఒక కోటిమంది భారతీయ రైతులను చేరుకోవడంలోనూ సహాయపడుతుంది.

'కోర్టెవా విత్తన శుద్ధిలో అత్యాధునిక సాంకేతికతను ప్రారంభించనుంది': డాక్టర్ ప్రశాంత పాత్ర

Share your comments

Subscribe Magazine