Agripedia

మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ చర్యలు?

KJ Staff
KJ Staff

రైతులు పండించే పంటలు మొక్కజొన్న పంట కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే మొక్కజొన్న పంట దిగుబడి తగ్గడానికి కత్తెర పురుగు ప్రధాన కారణం అవుతుంది. అయితే మొక్కజొన్నలో నివారించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

మొక్కజొన్నలో గొంగళి పురుగు వ్యాపించి మొక్కజొన్న ఆకులను క్రమంగా తింటూ ఆకులను కత్తిరించినట్లు కనపడటంవల్ల దీనిని కత్తెర పురుగు అంటారు.గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన “Y” ఆకారంలో తెల్లని చారను కలిగి ఉండును. గొంగళి పురుగు ఉదర భాగం చివరిలో 4 నల్లటి చతురస్రాకార చుక్కలు ఉంటాయి. గొంగళి పురుగు పెరిగేకొద్దీ ఈ ఆకుల చివరి నుంచి కత్తిరిస్తూ తింటూ ఉంటాయి. ఇది ఆకుసుడులను మరియు కాండాన్ని కూడా తొలచి రంధ్రాలను చేసి పంటను తీవ్ర నష్టపరుస్తుంది.

ఈ విధమైన పురుగును నివారించి రైతులు అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ముందుగా తమ పొలంలో భూమిని లోతుగా దున్నాలి. ఇలా చేసినప్పుడే పురుగు కోశస్థ దశలు నాశనమవుతాయి.మొక్కజొన్న పంట చుట్టూ 4-5 వరుసల గడ్డి పెంచడం వల్ల మొక్కజొన్న పంటకు నష్టం తగ్గి రైతులు అధిక లాభాలను అందిస్తుంది.రైతులు పొలలో గ్రుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి ఒక లీటరు వేపనూనెను లేదా 5% వేప గింజ కషాయాన్ని పిచికారీ చేయాలి.అదే విధంగా ఎకరానికి 500మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 400 మి.లీ. క్వినాల్ ఫాస్ మందులను పిచికారీ చేయడం వల్ల కత్తెర పురుగును నివారించి రైతులు అధిక దిగుబడి పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More