Agripedia

పుట్టగొడుగు పెంపకం దారులను అధికంగా నష్టపరిచే వ్యాధులు? నివారణ చర్యలు..

Srikanth B
Srikanth B

వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైనా పుట్టగొడుగుల పెంపకానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.సకల పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పుట్టగొడుగులకు ఏడాది పొడవునా మంచి ధర లభిస్తుండటంతో చాలామంది రైతు సోదరులు, నిరుద్యోగ యువత వీటి పెంపకాన్ని చేపట్టి అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పుట్టగొడుగుల్లో సర్వసాధారణంగా వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం.

సాధారణంగా పుట్టగొడుగుల పెంపకం సరైన యాజమాన్య పద్ధతులతో పెంచితే ఎటువంటి వ్యాధులు రావు. సరైన పరిశుభ్రత చర్యలు పాటించకుంటే పుట్టగొడుగుల్లో ప్రధానంగా సాఫ్ట్ మిల్ డ్యూ (మెత్తటి బూజు), బ్రౌన్ ప్లాస్టర్ మోల్డ్ (గోధుమ రంగు బూజు), వైట్లాస్టర్ మోల్డ్ (తెల్ల బూజు), ఆలివ్ గ్రీన్ మోల్డ్ (ఆలివ్ గ్రీన్ బూజు), నలుపు (బ్లాక్ మోల్డ్), ఆకుపచ్చ (గ్రీన్ మోల్డ్), బ్యాక్టీరియా మచ్చలు (బ్యాక్టీరియా బ్లాచెస్) తెగుళ్ళు ఆశిస్తాయి.వీటి నివారణకు గదిలో డైక్లోరోవాస్ 6 మి.లీ. 10 లీటర్లు నీరు లేదా బావిస్టిన్ (0.1 శాతం) లేదా ఫార్మాల్డిహైడ్ (10 శాతం) గదుల గోడల వెంట, గోనె సంచుల పైన మరియు నేల మీద ప్రతి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పిచికారి చేసుకోవాలి.

వేసవిలోనే పొలాన్ని దున్ని ఉంచుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి!

దోమ ఎక్కువగా ఉన్నట్లయితే వేప ద్రావణాన్ని 5 మి.లీ / లీ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. పుట్టగొడుగుల బెడ్స్ బ్యాక్టీరియా మచ్చలు కనిపిస్తే 2 గ్రా. బ్లీచింగ్ పౌడర్ని 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. క్రాపింగ్ రూములో ఎప్పటికప్పుడూ ఫార్మాల్డిహైడ్ 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి. అనుకూలమైన వాతావరణం లేకపోతే పుట్టగొడుగుల నాణ్యత తగ్గుతుంది. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకం గదిలో సరైన గాలి, వెలుతురు వ్యవస్థ ఉండాలి.లేనట్లయితే పుట్టగొడుగులు పొడవుగా మందమైన కాడలతో చిన్నవిగా ఏర్పడి పుట్ట గొడుగు నాణ్యత లోపించి సరైన ధర లభించదు.

రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం.. రూ. 2000 వేల స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

Share your comments

Subscribe Magazine