Agripedia

Bamboo Farming: వెదురు చెట్లను పెంచడం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం..

KJ Staff
KJ Staff
Bamboo Farming
Bamboo Farming

రైతులకు ఆర్థికంగా మద్ధతు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి జాతీయ వెదురు మిషన్. ఈ చెట్లను పెంచడం ద్వారా రైతులు ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. ఒక్క వెదురు చెట్టుకు ప్రభుత్వం రూ.120 అందిస్తుంది. మరీ ఈ చెట్లను ఎలా పెంచాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసుకుందామా.

ఈ చెట్లను పెంచడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. ఎందుకంటే.. వీటిని 2018లోనే కేంద్రం చెట్ల జాబితాను తొలగించింది. అయితే వేరే ప్రాంతాల్లోని వెదురు చెట్లను కట్ చేయడం వంటి పనులు చేయకూడదు. రైతులు తమ సొంత భూమిలో ఈ చెట్లను పెంచాల్సి ఉంటుంది.

వెదురు చెట్లలో 136 జాతులు ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా 10 రకాలనే ఉపయోగిస్తుంటాం. అయితే ఈ చెట్లను పెంచే ముందు రైతులు ముందుగా ఏ జాతి వెదురును పెంచాలనుకుంటున్నాడో సెలక్ట్ చేసుకోవాలి. మన ఇండియాలో వెదురుతో ఫర్నిచర్ ఉపయోగిస్తారు. అందుకే ఫర్నిచర్ తయారీ కోసం ఉపయోగించే వెదురును పెంచడం ఉత్తమం.

ఈ చెట్లను పెంచడానికి దాదాపు 3 నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. ఆఖరు సంవత్సరంలో ఈ చెట్లను కట్ చేయడం ప్రారంభించాలి. అయితే ఒక్క వెదురు  చెట్టుకు మరో చెట్టుకు మధ్య 3 నుంచి 4 మీటర్ల గ్యాప్ ఉండాలి. వీటి పొలంలో మరో పంటను కూడా పండించుకోవచ్చు. ఈ పంటతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. వెదురు ఆకులు పశువులకు గ్రాసంగా ఉపయోగించడమే కాకుండా.. ప్రకృతి కూడా కాలుష్యం కాదు. మన దేశంలో వెదురు ఫర్నిచర్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. కనుక.. ఒక హెక్టార్ భూమిలో 1,500 నుంచి 2,500 మొక్కలను నాటవచ్చు. వెదురు మొగ్గలను కూడా విక్రయిస్తుంటారు.

ప్రభుత్వ సహాయం..

వెదురు పంట కోసం 3 సంవత్సరాలలో ఒక మొక్కకు రూ.240 ఇస్తారు. అంటే ఒక్క చెట్టుకు రూ.120 గా ప్రభుత్వం సహాయం చేస్తుంది. అంటే ఇందులో 50 శాతం ప్రభుత్వం.. 50 శాతం రైతులు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ రావాణాలో కేంద్ర ప్రభుత్వ వాట 60శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా శాతం 40 శాతం. ఈ పంట సాగు కోసం.. పూర్తి సమాచారాన్ని జిల్లాల్లోని నోడల్ అధికారిని అడిగి తెలుసుకోవాలి.

వెదురు సాగు ద్వారా సంపాధన..

ఒక రైతు 3*2.5 మీటర్ల మొక్కను నాటితే.. హెక్టారుకు 1,500 మొక్కలు నాటితే.. అతను వెదురు మొక్కల  మధ్య ఉంటే స్థలాన్ని మిగతా పంట వేయవచ్చు. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పంట ద్వారా రూ. 3 నుంచి రూ.3.5 లక్షల వరకు సంపాదించవచ్చు. ఒక ఎకరం వెదురు నుంచి రూ.25-35 వరకు విలువైన కల్లాస్ అమ్మవచ్చు. వెదురు మొక్కలు దాదాపు 40 సంవత్సరాలు బతుకుతాయి. ఈ పంట కోసం పూర్తి సమాచారాన్ని  nbm.nic.in వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine