Agripedia

కొత్త వంగడాలు రూపకల్పనలో రికార్డు సృష్టించిన.. వైయస్సార్ వర్సిటీ!

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యాన తోటల హబ్‌గా
తీర్చిదిద్దడంలో కీలకపాత్ర వహిస్తూ,మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమైన వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పడిన13 ఏళ్లలో 29 నూతన ఉద్యాన వంగడాలను ఆవిష్కరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి నిచ్చే వంగడాలను ఇన్ని ఒకేసారి అభివృద్ధి చేయడం, వాటిని కేంద్రం నోటిఫై చేయడం దేశంలోని వ్యవసాయ,ఉద్యాన యూనివర్సిటీల చరిత్రలో ఇదే తొలిసారి కావడం మన రాష్ట్రం గర్వించదగ్గ విషయం.

వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గతంలో అభివృద్ధి చేసిన వంగడాలలో మిరపలో 5 రకాలు, ధనియాలులో 7 రకాలు,చామలో 2, మెంతులులో 1, కందలో 1రకం చొప్పున 16 కొత్త వంగడాలను అభివృద్ధి చేసింది. ఈ వంగడాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. తాజాగా వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ పరిశోధనా కేంద్రాల నుంచి 23 వంగడాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపింది. వాటిలో 13 వంగడాలు మన ప్రాంత వాతావరణంకి చక్కగా సరిపోతాయని గుర్తించి భారత కేంద్రప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది.

వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2007లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈయూనివర్సిటీ పరిధిలో ఉద్యాన పరిశోధనా కేంద్రాలు19, కృషి విజ్ఞాన కేంద్రాలు 4, బీఎస్సీ ఉద్యాన కళాశాలలు 4, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో 4 రాష్ట్ర అభివృద్ధికి ఉద్యాన తోటల అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.

Share your comments

Subscribe Magazine