Agripedia

ఉల్లి సాగులో నారుమడి పెంపకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు....

KJ Staff
KJ Staff

ఎన్నో ఔషధ గుణాలు, పోషక విలువలు మెండుగా ఉన్న ఉల్లిగడ్డకు భారతీయుల ఆహారంలో ప్రముఖ స్థానం ఉంది. ఉల్లి పంట స్వల్ప కాలిక పంట‌‌ . ఉల్లి సాగు ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నుండి అక్టోబరు ,నవంబరు వరకు సాగుచేస్తారు. రభి సీజన్లో అయితే నవంబరు చివరి వారం నుండి ఏప్రిల్ వరకూ సాగు చేసుకోవచ్చు. అదే ఉల్లి పంటను వేసవి పంటగా సాగు చేసుకుంటే జనవరి, పిబ్రవరి నెలల్లో నాటవచ్చు.

ఉల్లిని మనరాష్ట్రంలో వర్షాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.సాధారణంగా ఉల్లి కొరత వర్షకాలంలో ఉంటుంది. ఆ సమయంలో ఉల్లి పంటను మార్కెట్ కు తరలిస్తే అధిక లాభాలను పొందవచ్చు. అధిక సేంద్రియ పదార్థం గల అన్ని రకాల నేలలు ఉల్లిసాగుకు అనుకూలమే. అయితే నీరు ఇంకే స్వభావమున్న ఒండ్రు మట్టి ఇసుక నేలల్లో అధిక దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా ఉల్లినారు నాటుకోవడానికి రెండు పద్ధతులు అనువైన మొదటిది చిన్న, చిన్న మడులలో నాటుకునే పద్ధతి ఇది నీటి పారుకం ద్వారా పండించడానికి అనువుగా ఉంటుంది. రెండవది ఎత్తు బెడ్ల పద్ధతి ఇది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండించడానికి అనువుగా ఉంటుంది.

ఉల్లి నారుమడి పెంపకం:

ఎకరాకు మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది.దీనికోసం120 సెం.మీ. వెడల్పు , 15 సెం.మీ. ఎత్తు గల బెడ్లను తయారు చేసుకోవాలి.ఉల్లి విత్తనాన్ని కాప్టాన్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.కిలో చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.విత్తనాన్ని 10 సెం.మీ. వరుసల మధ్యదూరంలో విత్తుకొని బెడ్లను ఎండుగడ్డితో మల్చింగ్ చేసుకొని మొలకెత్తిన తరువాత గడ్డి తీసివేయాలి. ప్రతి రోజు తేలికపాటి తడులు ఇవ్వాలి. నారుకుళ్ళు ఆశించకుండా ప్రతి పదిరోజులకు ఒకసారి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా./లీ. నీటితో కలిపి నారు మడులను తడుపుకోవాలి. రసం పీల్చే పురుగులు నుండి రక్షణకు ఫిప్రొనిల్ గుళికలు 160 గ్రా./ సెంటు భూమిలో చల్లుకోవాలి.

Share your comments

Subscribe Magazine