Agripedia

డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఎక్కువ పోషక విలువలు ఉండే పండ్లు?

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలని మన శరీరంలో తగిన అన్ని పోషక విలువలు ఉండాలన్న ఎక్కువగా తాజా పండ్లను తీసుకోవడం చేస్తుంటాము.ఈ విధంగా తాజా పండ్లను తినడం వల్ల అధిక పోషకాలు మన శరీరానికి అంది ఎంతో ఆరోగ్యంగా ఉంటామని భావిస్తాము. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండే పండ్లు కూడా ఉన్నాయి. మరి అవి ఏమిటి అవి ఏ ప్రాంతాలలో సాగు చేస్తారు అనే విషయాలను తెలుసుకుందాం...

చెట్టు మొత్తం ముళ్లను కలిగి ఉండి తీవ్ర ఎడారి పరిస్థితులను తట్టుకుని జీవించే మొక్కలలో బ్రహ్మ జముడు మొక్క ఒకటి అని చెప్పవచ్చు.ఈ విధమైనటువంటి బ్రహ్మజెముడు మొక్క ఇప్పటికీ పల్లెలలో పొలాల గట్లలో ఉండటం మనం చూస్తుంటాము. ఈ బ్రహ్మ జముడు పండ్లను తినడం వల్ల మనం ఎన్నో పోషకాలను పొందవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెన్నకేశవ రెడ్డి తన పరిశోధనలలో రుజువు చేశారు.

బ్రహ్మ జముడు పండ్ల గుజ్జుతో వివిధ రకాల ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసిన పరిశోధనలు జరిపారు. ఈ విధంగా డాక్టర్ చేసిన పరిశోధనలు సఫలీకృతం అయ్యాయి. బ్రహ్మజెముడు పండు ఎరుపు గులాబీ రంగులో ఉంటుంది.జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు.

ఈ పండులో ఎన్నో పోషక విలువలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఈ సందర్భంగా ప్రొఫెసర్ చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఈ పండ్లను తినడం వల్ల క్యాన్సర్, కాలేయ వ్యాధులు నివారణకు దోహదపడుతుందని, ఈ పండ్లలో ముఖ్యంగా కార్పోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ బ్రహ్మజెముడు పండ్లను తినడం వల్ల స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను పూర్తిగా తగ్గిస్తుందని చెప్పవచ్చు.

ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఎక్కువ పోషక విలువలు కలిగిన బ్రహ్మజెముడు మొక్కను బంజరు భూములలో సాగు చేసుకోవచ్చు. వీటికి ఎక్కువగా రసాయనిక మందులు ఉపయోగించాల్సిన పని లేదు. అదే విధంగా ఎక్కువ నీటి అవసరం కూడా ఉండదు.ఏడాదికి ఒక సారి పంట దిగుబడి వచ్చే ఈ పంటకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చని ఈ సందర్భంగా ప్రొఫెసర్ తెలిపారు.

Share your comments

Subscribe Magazine