వాతావరణ మార్పుల వలన రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా టమోటాల పంటపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
భారతీయ వంటకాల్లో టమాటాలకి ఎంత ప్రాధాన్యం ఉంది. భారతీయులు ఏ వంట చేసిన అందులో ఖచ్చితంగా టమాటాలు ఉండాల్సిందే. టమాటాలు మన భోజనానికి మంచి ఫ్లేవర్‌ను జోడించి వాటిని మరింత రుచికరమైనవిగా చేస్తాయి. అయితే టమాటాల ఉత్పత్తి తగ్గి అంతర్జాతీయ మార్కెట్ లో కొరత ఏర్పడే అవకాశం ఉందని తాజా నివేదికలో వెల్లడైంది. వాతావరణ మార్పుల వలన రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ టమోటాల పంటపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తెలిపింది.
డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం, పెరుగుతున్న ఉష్ణోగ్రత టమోటాల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి అధ్యయనంలో పునరుత్పత్తి చేయబడిన నమూనాను రూపొందించింది.
ఇటలీ, చైనా, కాలిఫోర్నియాదేశాలు టమాటా ఉత్పత్తి అగ్రస్థానంలో ఉన్నాయని ప్రపంచ ఉత్పత్తిలోత్తి మూడింట రెండు వంతులు ఇక్కడే టమాటా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొ న్నారు. అయితే ఈ దేశాలు గ్లోబల్ వార్మిం గ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది.దీంతో 2050 నుంచి 2100 మధ్య టమాటా పంట ఉత్పత్తి తగ్గిపోగ్గి తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
తాజా నివేదిక ప్రకారం 2050 నాటికి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలను దాటితే.. టొమాటో ఉత్పత్తి ఆరు శాతం తగ్గుతుందని, మొత్తానికి 2050 నాటికి టమాటా ఉత్పత్తి సగానికి పడిపోతుందన్నారు.
గత కొన్ని నెలలుగా, భారతదేశం ఘోరమైన వేడి తరంగాలను చూసింది, ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇటీవల వడగాలుల కారణంగా టమాటా ఉత్పత్తి తగ్గిపోయి ధరలు విపరీతంగా పెరిగిన సామాన్యులకి భారంగా మారాయి.
మరిన్ని చదవండి.
Share your comments