Agripedia

టమాటా లో గల ముఖ్యమైన మరియు అధిక దిగుబడినిచ్చే రకాలను తెలుసుకోండి!

S Vinay
S Vinay

దేశవ్యాప్తంగా ఉన్న మేలైన టమాటా రకాలు మరియు వాటి ప్రత్యేక ప్రయోజనాలు (వెరైటీస్) తెలుసుకోండి.

వైశాలి
ఇది మీడియం సైజు (100 గ్రా) నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేసే ఒక నిర్ణీత హైబ్రిడ్ రకం టమాటా.
వేడి మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులలో పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకం ఫ్యూసేరియంకు తట్టుకోగలదు.
టమోటా జ్యూస్ తయారీకి అనుకూలం.

రూపాలి
ఈ హైబ్రిడ్ మధ్యస్థ పరిమాణంగా (100 గ్రా) గుండ్రని, దృఢమైన, మృదువైన మరియు మంచి నాణ్యత గల పండ్లు. పండ్లు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.వడల తెగులు నిరోధకతను కలిగి ఉంటుంది. ప్రాసెసింగ్‌కు అనుకూలం.

రష్మీ
ఇది నిర్ణీత, విస్తృతంగా పండిస్తున్న హైబ్రిడ్ రకం. పండ్లు గుండ్రంగా, దృఢంగా, మృదువైనవి మరియు మంచి రంగుని కలిగి ఉంటాయి.వడల తెగులు నిరోధకతను కలిగి ఉంటుంది. . ప్రాసెసింగ్‌కు అనుకూలం.

రజని
ఈ రకం టమాటా చాలా త్వరగా పెరుగుతుంది మరియు నిర్దిష్ట రకం. పండ్లు ఎరుపు రంగుతో గుండ్రంగా ఉంటాయి.సుదూర రవాణాకు అనుకూలంగా ఉంటుంది.

పూసా రూబీ
ఈ రకాన్ని న్యూ ఢిల్లీలోని IARI విడుదల చేసింది.వసంత-వేసవి మరియు వేసవిలో విత్తడానికి వెరైటీ అనుకూలంగా ఉంటుంది
సగటు దిగుబడి హెక్టారుకు 32.5 టన్నులు ఉంటుంది.ఇది ప్రాసెసింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

పూసా ఎర్లీ డ్వార్ఫ్
ఈ రకాన్ని న్యూ ఢిల్లీలోని IARI విడుదల చేసింది. టమాటా పండ్లు చదునుగా ఉంటాయి . 75-80 రోజుల తర్వాత పండ్లు కోతకు సిద్ధంగా ఉంటాయి.సగటు దిగుబడి హెక్టారుకు 35 టన్నులు. ఇది టేబుల్ మరియు ప్రాసెసింగ్ ప్రయోజనం కోసం అనుకూలంగా ఉంటుంది.


పూసా 120
ఈ రకాన్ని కూడా న్యూ ఢిల్లీలోని IARI విడుదల చేసింది. పండ్లు మధ్యస్థంగా పెద్దవి, మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇది అధిక దిగుబడినిస్తుంది మరియు నెమటోడ్‌ తాకిడిని తట్టుకోగలదు.

CO 1
ఈ రకాన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వా విద్యాలయం విడుదల చేసింది. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెరగడానికి అనువుగా ఉండుడి. పండ్లు గుండ్రంగా ఉంటాయి.

Best of All
ఈ రకాన్ని న్యూ ఢిల్లీలోని IARI విడుదల చేసింది.పండ్లు గుండ్రంగా ఉంటాయి. మొక్క కాండం దృఢంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కొండా ప్రాంతాల్లో పెరగడానికి అనువైనది.

రోమా
ఈ రకాన్ని న్యూ ఢిల్లీలోని IARI విడుదల చేసింది. టమాటా పండ్లు పసుపు మరియు దీర్ఘవృత్తాకార ఆకారంలో ఉంటాయి. మందపాటి కాండం కలిగి ఉంటుంది.ఈ రకం ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.


మరిన్ని చదవండి.

ఇంటి పెరట్లో టమాటలు సాగు చేయడం ఎలా

Share your comments

Subscribe Magazine