Agripedia

కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్న "తేలు" విషం......

KJ Staff
KJ Staff

ఆకారంలో చిన్నదైనా తేలు విషం మాత్రం చాల ప్రమాదకరం. ఒక్క తేలు కాటు వల్ల ప్రాణహాని లేకపోయినా భరించలేని నొప్పిని తేలు విషం కలగచెయ్యగలదు. మన దేశంలో కనిపించే ఎర్ర తేలు విషం చాల ప్రమాదకరమైనది. ఎర్ర తేలు కాటుకు గురై, సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాల మంది ఉన్నారు. అయితే ఇంతటి పరమాధికారి అయినా తేలు విషానికి అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయల ధర పలుకుతుంది.

సృష్టిలో ఏ ప్రాణీ, ఇతరులకు హాని చెయ్యాలనుకోదు, కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుంది. ముఖ్యంగా విషపూరిత జంతువులు వాటి ఆకలి తీర్చుకోవడానికి ఇతర జంతువులను హతమారుస్థాయి. తేలును ఒక విషపూరిత కీటకంగా చెప్పుకోవచ్చు. చీకటిగా మరియు తడిగా ఉండే ప్రదేశాల్లో తేళ్లు ఎక్కువుగా కనిపిస్తాయి. ఒక్క భారత దేశంలోనే సుమారు 102 రకాల జాతులకు చెందిన తేళ్లు ఉన్నాయి, వీటి అన్నిటిలోకెల్లా అతి ప్రమాదకరమైనవి ఎర్ర తేళ్లు, ఒక ఎర్ర తేలు నుండి వచ్చే విషం ఒక మనిషిని చంపడానికి సరిపోతుంది. అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన తేలుగా డెత్ స్టాకర్ ను పరిగణిస్తారు. అయితే ఇంకొక్క ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఈ తేలు విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉంది, ఈ తేలు ఒక్క చుక్క విషం సుమారు 130$ వరకు పలుకుతుంది మన ఇండియా కరెన్సీలో అక్షరాల పదివేల రూపాయిలు అన్నమాట.

అధిక లాభాలు అందిచే పుట్టగొడుగుల పెంపకం:

అయితే ఈ విషానికి ఇంత గిరాకీ ఉన్న విషాన్నిసేకరించి కోటీశ్వరులు అవుదాం అనుకుంటే అది ప్రాణాలతో చెలగాటం ఆడటం. ఈ రకం తేళ్లు పెంచడం చాల కష్టం, ధికి ఎంతో అనుభవం అవసరం. ప్రపంచంలో అతి కొద్దీ మంది మాత్రమే ఈ తేళ్లను పెంచి విషాన్ని సాగు చేస్తున్నారు. పైగా ప్రతి తేలు నుండి ఒకరోజుకి కొద్దీ పాటి విషాన్ని మాత్రమే సాగుచేసేందుకు వీలుంటుంది. ఒక లీటర్ విషాన్ని పొందడానికి కొన్ని లక్షల తేళ్లు అవసరం. ఒక లీటర్ తేలు విషం సుమారు ఒక కోటి రూపాయిల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ తేలు విషాన్ని కొన్ని ప్రత్యేకమైన మందుల తయారీలోనూ, మరియు క్యాన్సర్ సెల్స్ పరిమాణాన్ని నిర్దేశించడంలోనూ ఉపయోగిస్తారు. 

Soil Health Card: మట్టి ఆరోగ్యం యొక్క సమగ్ర నివేదిక.

Share your comments

Subscribe Magazine