Kheti Badi

Mushroom Cultivation and management: అధిక లాభాలు అందిచే పుట్టగొడుగుల పెంపకం:

KJ Staff
KJ Staff
Image Souce: iStocksuprabhat dutta
Image Souce: iStocksuprabhat dutta

వ్యవసాయ అనుసంధాన రంగాల్లో ఒక్కటైనా పుట్ట గొడుగుల పెంపకం మంచి లాభదాయకమైనది. తక్కువ శ్రమ ఎక్కువ లాబాలు తెచ్చిపెట్టే వాణిజ్య రంగంలో పుట్ట గొడుగులా పెంపకం ఒక్కటి. మన దేశంలోని ఎంతో మంది నిరోద్యోగ యువతకు, మహిళలకు ఇది ఒక చక్కటి వ్యాపారం. పుట్ట గొడుగుల పెంపకంలో ఎన్నో లాభాలు ఉన్నా, ఒక చిన్న పొరపాటు అయినా సరే భారీ నష్టాలు తెస్తుంది. కనుక పుట్ట గొడుగుల పెంపకానికి చాల ఓపిక, తప్పులనుండి నేర్చుకోగలిగే సామర్ధ్యం కావాలి. చదువుకున్న యువత పుట్ట గొడుగుల పెంపకాన్ని ఒక వ్యాపార మార్గంగా ఎంచుకోవడం గర్వించ్చదగ్గ విష్యం. మీలో చాలామందికి పుట్టగొడుగుల పెంపకం గురించి అనేక సందేహాలు ఉంటాయి. వాటికి జవాబు ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగింది. చివరి వరకు చదివి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

పుట్ట గొడుగులా పెంపకం లాభదాయకమేనా?

ఈ ప్రశ్న మీలో చాల మందికే వచ్చి ఉంటుంది. తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండి ఎక్కువ శక్తిని ఇచ్చే, ఈ పుట్ట గొడుగులు ప్రజలు ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగ శాకాహారులకు, అనేక మాంశకృతులు కలిగిన పుట్టగొడుగులు ఒక మంచి మాంశ ప్రత్యామ్నాయం. రెస్టారెంట్లలో, ఫంక్షనలో ఎక్కువుగా ఉపయోగించే మష్రూమ్కు మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువుగానే ఉంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించగలిగితే, పుట్టగొడుగుల పెంపకం నుండి నెలకు సుమారుగా 50,000-80,000రూ వరకు పొందవచ్చు.

 

అసలు పుట్టగొడుగులలో రకాలు ఏమిటి?

పుట్ట గొడుగులు లేదా ముష్రూమ్స్, మీరు అనుకునేటట్టు, మొక్క జాతికి చెందినవి కాదు. అగ్రారికాస్ అనే జాతికి చెందిన శిలింద్రలు. మొక్క జాతికి చెందినవి కావు కాబట్టి , మాంసాహారం కిందకి వస్తాయి అని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు, శిలింద్రం లేదా ఫంగస్, జంతు జాతికి చెందినది కాదు, కాబ్బటి నిశ్చింతగా తినవచ్చు. అయితే అన్ని రకాల ముష్రూమ్స్ తినదగినవి కావు, వీటిలో కొన్ని విషపూరితం అయినవి కూడా ఉన్నాయ్. కాబట్టి పొలంగట్ల మీద లభించే పుట్టగొడుగులు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. రంగురంగులుగా ఉంది , గొడుగు పై భాగంలో మచ్చలు ఉన్న పుట్టగొడుగులను విషపూరితమైనవిగా గుర్తించవచ్చు. మనం తినగలిగే రకాలలో, ఆయిస్టర్ పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు(మిల్కీ ముష్రూమ్స్) ఈ మూడు ప్రధానమైనవి. వీటి గురించి క్లుప్తంగా తెల్సుకుందాం.

ఆయిస్టర్ పుట్టగొడుగులు(Oyster mushrooms): ప్లేయూరోటస్ ఆస్ట్రేటుస్ అని పిలవబడే ఈ ముష్రూమ్స్ ఆల్చిప్ప ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం ముష్రూమ్స్ పండించడం కూడా చాల సులువు. లేత గోధుమ రంగులో ఉండే ఈ ముష్రూమ్స్ తక్కువ వేడి మరియు ఎక్కువ తేమ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి. ఈ రకం ముష్రూమ్స్ పెంచాలి అనుకునే వారు, 22-25 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత, 60-80% తేమ ఉండేలా చూసుకోవాలి. పెంచడం సులువు అయినప్పటికీ మార్కెట్లో ఈ రకం ముష్రూమ్స్ కి డిమాండ్ కొంచెం తక్కువ. పైగా వీటి నిల్వ సామర్ధ్యం కూడా తక్కువే, కనుక ఈ పుట్టగొడుగులు పెంచాలి అనే ఆలోచన ఉన్నవాళ్లు, మార్కెట్ డిమాండ్ బట్టి వీటిని పెంచవలసి ఉంటుంది.

పాల పుట్టగొడుగులు(Milky Mushrooms): శాస్త్రీయంగా కాలోసీబీ ఇండికా అని పిలవబడే ఈ ముష్రూమ్స్, పేరుకు తగ్గట్టే, తెల్లని పాల రంగులో ఉంటాయి. పొడవైన కాడలతో, మరియు పెద్ద గొడుగుతో ఉండే ఈ ముష్రూమ్స్ ఎక్కువ ఉష్ణోగ్రతలో పెరగడానికి ఇష్టపడతాయి, 35-38 సెంటిగ్రేడ్ల వేడి, 80-85% తేమ అవసరం. అధిక పీచు పదార్ధాలు ఉన్న ఈ ముష్రూమ్స్ పెంపకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ముష్రూమ్స్ యొక్క నిల్వ సామర్ధ్యం కూడా ఎక్కువే, రెఫ్రిజిరేటర్స్ లో ఉంచి 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పెద్ద రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు వీటిని ఎక్కువుగా కొనుగోలు చేస్తాయి. బయట దేశాలకు కూడా ఎక్సపోర్ట్ చేసేందుకు వీలుగా ఉంటాయి.

బటన్ పుట్టగొడుగులు(Button ముష్రూమ్స్): అగారికాస్ బైస్పార్స్ గ పేరు ఉన్న ఈ ముష్రూమ్స్ను మనం మార్కెట్లో, తెలుపు మరియు గోధుమ రంగుల్లో చూస్తుంటాం. అనేక రకాల వంటకాల్లో, పిజ్జా పై టాపింగ్స్గా వాడే ఈ ముష్రూమ్స్ 1-3 ఇంచుల పొడవుతో ఉంటాయి. మంచి క్యాలోరిస్, విటమిన్స్, మినరల్స్, ఉన్న బటన్ ముష్రూమ్స్, పెరగడానికి, 20-28 సెంటిగ్రేడ్ల వేడి, 80-90% వరకు వాతావరణ తేమ అవసరం. ఈ రకం పుట్టగొడుగులు పెంచడానికి పల పుట్టగొడుగులులాగానే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పుట్టగొడుగులు ఉప్పు నీటిలో ఉంచి డబ్బాల్లో పెట్టి చాల రోజుల వరకు నిల్వ చేసి ఉంచుతారు.

పుట్టగొడుగులు పెంపకం నేర్చుకోవడం ఎలా ?

పుట్ట గొడుగులా పెంచడం మొదలుపెట్టె ముందు. చాల శిక్షణ అవసరం. మీ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రం ద్వారా ఈ శిక్షణ పొందవచ్చు, లేదా శిక్షణకు అవసరం అయ్యే సమాచారాన్ని పొందవచ్చు. కర్ణాటక లో ఉన్న IIHR(ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ ) అనే సంస్థ పుట్టగొడుగుల పెంపకానికి అవసరం అయ్యే శిక్షణను, మరియు వీటి పెంపకానికి అవసరం అయ్యే spawn(స్పాన్) ని అందచేస్తుంది. పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్నవారి నుండి కూడా ఈ పుట్టగొడుగుల పెంపకంలో మెళుకువలను స్వయంగా చూసి తెలుసుకోవచ్చు. కానీ మీరు పాటించే నిర్వహణ పద్ధతులే, మీకు లాభాన్ని లేదా నష్టాన్ని కలిగించగలవు అని మాత్రం గుర్తు పెట్టుకోండి.

 

పుట్టగొడుగులు పెంచడం ఎలా?

  • ముందుగా చెప్పినట్టే, మష్రూమ్ పెంపకంలో మీకు అవసరమయిన సామర్ధ్యం మీకు వచ్చింది అని మీరు నమ్మిన తరువాతే , పుట్టగొడుగుల వ్యాపారం మొదలు పెట్టండి.
  • మొదట మష్రూమ్ పెంపకానికి అవసరం అయ్యే Spawn ని ఎంచుకోవాలి. సులువుగా చెప్పాలి అంటే మొక్క ఎదగడానికి విత్తనం ఎలా అవసరమో మష్రూమ్ ఎదగడానికి Spawn కూడా అంతే అవసరం. మంచి స్పాన్ ని ఎంచుకోవడంలోనే మీకు వచ్చే లాభం లేదా నష్టం ముడిపడి ఉంటాయి .
  • మీకు అనువైన, ఆయిస్టర్, బటన్, లేదా పాల పుట్టగొడుగుల రకాన్ని బట్టి స్పాన్ ని కొనుగోలు చెయ్యాలి. స్పాన్ కోసం మీకు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని కానీ, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ IIHR నుండి కానీ నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.
  • మష్రూమ్ పెంపకంలో ఎండు గడ్డి ఎంతో కీలకం. వరి లేదా గోధుమ గడ్డిని వీటి పెంపనికి అనువుగా ఉంటాయి. రోగాలు లేనటువంటి, మంచి ఎండుగడ్డిని రైతుల నుండి నేరుగా కొనుగోలు చెయ్యచ్చు. ఈ గడ్డిని నీడగా మరియు పొడిగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయవలసి ఉంటుంది.
  • పుట్టగొడుగులను రోగాలను నుండి కాపాడానికి ఫార్మలిన్, కార్బొడిజం చాల అవసరం. వీటిని సమయానుసరంగా వాడాలి.

పుట్ట గొడుగుల పెంపకం క్లుప్తంగా:

మొదట గడ్డిని, కటింగ్ మిషన్ సాయంతో 2-3 ఇంచుల ముక్కలుగా కత్తిరించుకోవాలి. రోగాలు లేని గడ్డిని ఎంచుకోవడం శ్రేయస్కరం. గడ్డిలోని క్రిమికీటకాలను తొలగించే పద్దతిని స్టెరిలైజషన్ అంటారు. స్టెరిలైజేషన్ రెండు రకాలుగా చేసుకోవచ్చు, ఒకటి గడ్డిని నీటిలో మరిగించడం ద్వారా, రెండు రసాయనాల ద్వారా. ఎక్కువ మొత్తంలో ముష్రూమ్స్ పండించేవాళ్ళు, రసాయన పద్దతుల ద్వారా గడ్డిని స్టెరిలైజ్ చెయ్యడం ఉత్తమం. ఈ ప్రక్రియ కోసం ముందుగా, ఒక పెద్ద పీపాలో 100 లీటర్ల నీటికి 250 మిల్లీలీటర్ల ఫార్మలిన్, 7 గ్రాముల, కార్బండిజమ్ కలిపినా ద్రావణంలో, గడ్డిని వేసి ఒక పన్నెండు గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన గడ్డిని ఎండలో కాకుండా నిండగా ఉన్న ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలి. పుట్టగొడుగుల పెంపకానికి గడ్డి ఎక్కువ తేమగా లేదా పొడిగా ఉండకూడదు, గడ్డిని పిండి చూస్తే చేతిలో తేమ ఉండి, నీరు క్రిందకి పడకుండా ఉంటె గడ్డి సిద్ధం అయినట్లు గుర్తించాలి.

ఇప్పుడు 60 సెంటీమీటర్ల పొడవు, 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో, ఒక పొర గడ్డిని మరో పోర మష్రూమ్ స్పాన్ ఇలా పొరలు పొరలుగా పేర్చుకుంటూ నింపిన సంచిన, రబ్బర్ సాయం తో గట్టిగ మూసివేయాలి.
తర్వాత వెలుగు తక్కువుగా ఉండే చీకటి గదుల్లో, రాక్స్ పై ఈ సంచులను ఉంచాలి. ఈ రాక్స్ ను వెదురు కర్రలతో కానీ ఇనుము తో కానీ తయారుచేసుకోవచ్చు. సంచులను ఉంచే ముందు, ఈ రాక్స్ ని, ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల ఫార్మలిన్ కలిపినా ద్రావణం తో శుద్ధి చెయ్యాలి. ఒక వారం రోజులకి ఈ స్పాన్ స్పాన్ సంచి మొత్తం భూజులా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ సంచులను సగానికి కోసి పై భాగంలో ఫార్మాలిన్తో శుద్ధి చేసిన పొడి మట్టిని నింపి, వెలుతురు ఉన్న గదుల్లోకి మార్చాలి.

మట్టిలోని తేమ శాతాన్ని బట్టి సంచులపై నీటిని చిమ్మరించుకోవాలి. ఇలా కనుక చేస్తూ వచ్చినట్లైతే, ఒక సంవత్సరానికి 8-10 సార్ల వరకు దుగుబడిని పొందవచ్చు. ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తిన, కాలానుక్రమంగా మంచి దిగుబడిని, మరియు లాభాలను ఆర్జించవచ్చు.

ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి:

పుట్టగొడుగుల పెంపంకానికి తేమ చాల అవసరం. డిజిటల్ హైడ్రోథెర్మోమీటర్ సాయంతో గదిలోని తేమను, ఉష్ణోగ్రతని నియంత్రించుకోవాలి. తేమను నియంత్రించడానికి వాపోరైజర్స్ ని వాడుకోవచ్చు లేదా నీటిని సంచులపై స్ప్రే చేయచ్చు. రోగాలనుండి కాపాడుకోవడానికి అవసరం అయ్యే నివారణ పద్ధతులు అన్ని క్రమం తప్పకుండా పాటించాలి.

Share your comments

Subscribe Magazine