Agripedia

హైడ్రోపోనిక్స్: మట్టి అవసరం లేని వ్యవసాయం...

KJ Staff
KJ Staff

పెరుగుతున్న సాంకేతికతలకు అనుగుణంగా, వ్యవసాయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు వీలుగా, మరియు రైతుల శ్రమ తగ్గించే దిశగా ఎన్నో కొత్త యంత్రాలు, వ్యవసాయ మెళుకువలు, ప్రంపంచంలో ప్రతిరోజు ఎదో ఒక మూల కొత్త విజ్ఞానం పురుడుపోసుకుంటూనే ఉంది. ప్రతీ రోజు 810 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వనరులతో ప్రతి ఒక్కరి కడుపు నింపడం ఎంతో కష్టం. కానీ వేగంగా వృద్ధి చెందుతున్న, సాంకేతికతతో వ్యవసాయాన్ని విలీనం చెయ్యగలిగితే ఇది సాధ్యపడుతుంది.

హైడ్రోపోనిక్స్:

ఈ మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో బాగా వినపడుతున్న పేరు. హైడ్రోపోనిక్స్ దీని గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే మట్టి అవసరం లేకుండా, కేవలం నీరు మరియు ఇతర పోషకాలతో పంటలు పండించడం హైడ్రోపోనిక్స్ ప్రత్యేకత. నీటితో పంటలు పండించడం సాధ్యమా అని మీకు సందేహం రావచ్చు, అయితే ఈ పద్ధతిని ఉపయోగించే ఒక చిన్న గడ్డి మొక్క కూడా మొలవని, అరబ్ దేశాల్లో వారికీ అవసరమయ్యే పంటలు పండించుకుంటున్నారు. మన దేశంలోని చాలామంది ఈ పద్ధతి నచ్చి తమ ఇళ్లలోనూ, పొల్లాలోను హైడ్రోపోనిక్స్ పద్దతిలో కూరగాయలు, ఆకురాలు పండిస్తున్నారు. పైగా ఎటువంటి పురుగు మందులు వాడకుండా మొక్కల్ని పెంచడంవల్ల, మార్కెట్లో హైడ్రోపోనిక్స్ కూరగాయలకు మంచి లాభం వస్తుంది ఇప్పటికే ఎన్నో స్టార్ట్-అప్ కంపెనీలు హైడ్రోపోనిక్స్ సిస్టమ్స్ తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టాయి. స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం మరొక్క ప్రత్యేకత.

Soil Health Card: మట్టి ఆరోగ్యం యొక్క సమగ్ర నివేదిక.

హైడ్రోపోనిక్స్ ద్వారా పంటలు పండించడం మూలంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.ముఖ్యంగా మట్టిలో పండించడం ద్వారా వచ్చే అనేక చీడపీడలను, రాకుండా నియంత్రించవచ్చు. రక్షిత వ్యవసాయం ద్వారా హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చెయ్యడం ద్వారా వాతావరణపై పూర్తి నియంత్రణ ఉండటం మూలాన మొక్కలు బలంగా ఎదిగి మంచి దిగుబడులు అందిస్తాయి. చీడపీడల భాద లేకపోవడం వల్ల, పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు తద్వారా, ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉండదు. హైడ్రోపోనిక్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్న కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు, ముందుగా హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా అన్ని రకాల పంటలు పండించడం సాధ్యం కాదు. ఆకుకూరలు, మరియు కూరగాయల్లో టమాటో, కాప్సికం, క్యాబేజీ వంటి పంటలను మాత్రమే పండించేందుకు వీలు ఉంటుంది.

హైడ్రోపోనిక్స్ లో అనేక రకాలున్నాయి, వాటిలో విక్ సిస్టం, వాటర్ కల్చర్ సిస్టం, డ్రిప్ సిస్టం, న్యూట్రియెంట్ ఫిలిం సిస్టం అందుబాటులో ఉన్నాయ్. వీటిలో న్యూట్రియెంట్ ఫిలిం సిస్టం(NFT) ఎక్కువుగా ఉపయోగిస్తారు. హెడ్రోపోనిక్స్ ద్వారా పంటలు పండించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. మట్టి అవసరం లేకుండా మొక్క పెంచుతున్నాం కాబట్టి, మట్టిలో లభించే పోషకాలను నీటిలో కలిపి వేర్ల ద్వారా మొక్కకు అందించాలి. హైడ్రోపోనిక్స్కి అవసరమయ్యే, పోషకాలు కాక్ టైల్ రూపంలో లభిస్తాయి. ఈ ద్రావణంలో స్థూలపోషకాలైన NPK తోపాటు సూక్ష్మ పోషకాలు కూడా లభ్యమవుతాయి. వీటిని పంట రకాన్ని బట్టి సూచించిన విధంగా,నీటిలో కలిపి మొక్కకు అందించవలసి ఉంటుంది

భారతదేశంలో టాప్ వ్యవసాయ పథకాలు ఇవే!

Share your comments

Subscribe Magazine