Agripedia

నకిలీ కుంకుమ పువ్వును గుర్తించడం ఎలా?

KJ Staff
KJ Staff

సుగంధద్రవ్యాయాల్లో కుంకుమ పువ్వుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఖరీదైన స్వీట్ల తయారీలోనూ, మరియు బిరియాని తయారీలోనూ కుంకుమ పువ్వును వాడుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు కుంకుమపువ్వును పాలల్లో కలుపుకుని తాగడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడని నమ్ముతారు. కుంకుమ పువ్వు భారత దేశంలో కేవలం కాశ్మీర్లో మాత్రమే పండుతుంది. చాల తక్కువ మొత్తంలో దిగుబడి రావడం మూలాన కుంకుమ పువ్వు ధర చాల ఎక్కువ, 100గ్రాముల కుంకుమ పువ్వు ధర 1000 రూ.ల వరకు ఉంటుంది. అయితే ఇదే అదునుగా చేసుకున్న కొంత మంది వ్యాపారుస్తులు, తక్కువ ధర పేరుతో, నకిలీ కుంకుమపువ్వు అమ్మి ప్రజల్ని మోసంచేసి సొమ్ము చేసుకుంటారు. అయితే మార్కెట్ లో దొరికే కుంకుమ పువ్వు అసలైందా కదా అనేది కొన్ని సులువైన పరిక్షల ద్వారా నిర్ధారించవచ్చు.

రంగును నిర్ధారించడం:
కుంకుమ పువ్వు దాని ముదురు ఎరుపు రంగుకు ఎంతో ప్రాముఖ్యం, అసలైన కుంకుమ పువ్వు రెండు చివర్లలో ఎర్రగా మద్య భాగంలో నారింజ రంగును కలిగి ఉంటుంది. రంగు సహజసిద్ధంగా లేకపోయినా, అక్కడక్కడా గోధుమ రంగు ఛాయా కలిగి ఉన్న అది నకిలీ కుంకుమ పువ్వు అని నిర్ధారించవచ్చు.

సువాసన మరియు ఆకృతి:
నిజమైన కుంకుమపువ్వు మంచి సువాసనను కలిగి ఉంటుంది అలాగే పెళుసుగా ఉంది రెండు వేళ్ళ మధ్య ఉంచి నలిపినప్పుడు సులభంగా విరుగుతుంది. అలాకాకుండా జిడ్డుగా కానీ తడిగా మాత్రం ఉంటె అది పూర్తిగా నకిలీది.

వాటర్ టెస్ట్:

కుంకుమ పువ్వును పరీక్షించడానికి మరొక్క సులువైన మార్గం ఏమిటంటే దానిని నీటిలో ఉంచడం. వేడి నీటిలో ఉంచిన కొద్దీ సేపటికి నీరు లేత బంగారు రంగులోకి మారినట్లైతే అది నిజమైనదే అదే నకిలీది అయితే నీటిలో ఉంచిన వెంటనే రంగును వదిలేస్తుంది.

చివరిగా కుంకుమపువ్వుకు ఉన్న ధర కారణంగా, చాల క్వాలిటీ ప్యాకేజీలో మాత్రమే విక్రయిస్తారు. రోడ్డు పక్కన దొరికే తక్కువ రేటు కుంకుమ పువ్వును కొన్ని మీ డబ్బును వృధా చేసుకోకండి.

Read More...

కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్న "తేలు" విషం......

హైడ్రోపోనిక్స్: మట్టి అవసరం లేని వ్యవసాయం...

మామిడిలో పిందే రాలడాన్ని అరికట్టడం ఎలా?

Share your comments

Subscribe Magazine