Agripedia

సేంద్రీయ పద్ధతిలో ద్రాక్ష సాగు చేయడానికి అనువైన నేలలు.. వాతావరణ పరిస్థితులు!

KJ Staff
KJ Staff

సాధారణంగా మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటలలో ద్రాక్ష ఒకటి. ప్రస్తుత కాలంలో రైతులు ద్రాక్షను ఎంతో విరివిగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సేంద్రియ పద్ధతులతో ద్రాక్ష సాగు చేయడానికి ఏ విధమైనటువంటి నెలలు.. వాతావరణ పరిస్థితులు అనుకూలం.. ద్రాక్ష సాగులోని రకాలు వంటి విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం...

ద్రాక్ష సాగు విస్తృతమైన వివిధ రకాల సాగును అందిస్తుంది. అయితే ఈ ద్రాక్షను వాటిని పెంచే విధానం, రంగు, రుచి, విత్తనాల ఆధారంగా వర్గీకరించవచ్చు ఈ క్రమంలోనే ఏరకమైన ద్రాక్ష దేని తయారీ కోసం ఉపయోగిస్తారు అనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా ద్రాక్షను ఎక్కువగా వైన్ తయారీ విధానంలో ఉపయోగిస్తాము. ఈ క్రమంలోనే రెడ్ వైన్ తయారు చేయడానికి మస్కట్ హంబర్గ్, ఫ్రెంచ్ బ్లూ, వంటి రకాలను రెడ్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు. చేనిన్ బ్లాంక్, సెమిల్లాన్ వంటి రకాలు వైట్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ విధంగా వివిధ రకాల ద్రాక్షలను సాగు చేయడానికి ఎలాంటి నేలలు అనుకూలం అనే విషయానికి వస్తే.. నేల పీహెచ్ స్థాయిలు 5 -5.7 మధ్య ఉండే నేలలు ఈ ద్రాక్ష సాగుకు ఎంతో అనుకూలం. సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉన్న నీటిపారుదల, లోతైన లోవామ్ నేలలు ద్రాక్ష సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధమైనటువంటి నేలలో సాగుచేసే ద్రాక్ష అధిక దిగుబడి ఇస్తుంది.

Share your comments

Subscribe Magazine