Agripedia

మునగ సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు..!

KJ Staff
KJ Staff

ఎన్నో ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు మెండుగా ఉన్నా మునగకాయ ఒకప్పుడు పెరటి
మొక్కగా ఉండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో వాణిజ్య శైలిలో సాగు చేయడానికి రైతులు మక్కువ చూపిస్తున్నారు.మునగలో ఏకవార్షిక మరియు బహువార్షిక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మునగకు ఉన్న డిమాండ్ దృష్ట్యా తక్కువ వ్యవధిలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి.

అధిక దిగుబడినిచ్చే మునగ విత్తన రకాలు:

పీ.కె.ఎం-1: దీనిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించారు.
వార్షిక మునగ సాగుకు అనుకూలమైనది. మొక్కలు 6 -7 మీ. ఎత్తు పెరిగి, నాటిన 90-100 రోజుల్లో పూతకు వచ్చి160-170 రోజుల్లో మొదటి కోత వస్తుంది. మొక్కకు సుమారుగా 220 కాయలు వచ్చి 75 సెం.మీ. పొడవు, సుమారుగా 150 గ్రాములబరువు ఉంటాయి. ఈ రకంగా మునగ దాదాపు ఒక హెక్టారుకు 50 టన్నుల దిగుబడి వస్తుంది.

పీ.కె.ఎం.2 : ఈ రకం కూడా ఆరునెలలో
కోతకు వస్తుంది. కాయలు 126 సెం.మీ పొడవు వుండి సుమారు 280 గ్రాముల బరువు తూగి, చెట్టుకు సంవత్సరానికి 220 కాయలు కాస్తాయి. ఒక హెక్టారుకు 98 టన్నుల దిగుబడి వస్తుంది.

ధనరాజ్ : పొట్టి రకం సంవత్సరానికి 250 నుండి 300 కాయలు కాపు నిస్తుంది. కాయ 35 నుంచి 40 సెం.మీలో ఉండి నాటిన 9-10 నెలల నుంచి కాపుకు వస్తాయిఈ రకం కె.ఆర్.సి ఉద్యాన కళాశాల, అరభావి, కర్ణాటక వారు రూపొందించారు.

జాఫ్నా : కాయ పొడవు 60-90 సెం.మీటర్లు. మెత్తని గుజ్జుతో రుచి కరంగా ఉండి సంవత్సరానికి చెట్టుకు 80 నుంచి 90 కాయలు, నాలుగో ఏడు నుంచి సంవత్సరానికి చెట్టుకు 500నుంచి 600 కాయలు పొందొచ్చు.ఇది బహువార్షిక మునగ రకం

Share your comments

Subscribe Magazine