సాధారణంగా మనం మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే, ఏ మార్కెట్ కో వెళ్లి కొన్నుకుంటాం. అలా కూడా మనకి అన్ని రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉండవు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన ఇంటి వద్దకే వస్తున్నాయి. దీనికొరకు కర్ణాటకలోని కోలార్ జిల్లా రైతులు మామిడి కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడికైన డెలివరీ చేస్తున్నారు.
ఈ ఆన్‌లైన్ మ్యాంగో డెలివరీ అనేది శ్రీచంద్రారెడ్డి మరియు భాస్కర్ రెడ్డికి చెందినది. కోలార్ రైతులు, తపాలా శాఖ సహకారంతో , బెంగళూరు జనరల్ పోస్టాఫీసులో సౌకర్యవంతమైన , ఇంటింటికీ మామిడి డెలివరీ సేవను ప్రారంభించారు.
హార్టికల్చర్‌లో డిప్లొమా పొందిన భాస్కర్ రెడ్డి, కోలార్ మామిడి రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందడంలో సహాయపడటానికి కోవిడ్‌కు ముందు ఈ వెంచర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. మహమ్మారి సమయంలో అమ్మకాలు చాలా బాగున్నాయి కానీ ఆ తర్వాత అది స్వల్ప క్షీణతను నమోడైనట్లు తెలిపారు.
ప్రస్తుతం తమ వద్ద అల్ఫోన్సో , బనగానపల్లె , ఇమామ్ పసంద్ , సెంతుర , కేసర్ , మల్లిక, పెన్నిష్ వంటి ఆరు రకాల మామిడి పండ్లు ఉన్నాయని, రానున్న నెలల్లో దాదాపు 22 రకాల మామిడి పండ్లను అందజేస్తామని భాస్కర్ రెడ్డి తెలిపారు . మామిడి పండ్ల ధర రకాన్ని బట్టి మారుతుంది. దీని ప్రారంభ ధర కిలో రూ.150 నుండి మొదలవుతుంది. ఒక పెట్టెలో మొత్తం మూడు కిలోల మామిడికాయలు ఉంటాయి.
ఇది కూడా చదవండి..
రేషన్ కార్డ్ కొత్త నిబంధనలు..కేంద్రం నిర్ణయంతో ప్రజలకు తీపి కబురు
ఈ సీజన్‌లో శ్రీనివాసపురంలో 1,000 నుండి 3,000 టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నామని చంద్రారెడ్డి చెప్పారు. 2020 లాక్‌డౌన్ సమయంలో, మామిడి డెవలప్‌మెంట్ అండ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మామిడిని ఇంటింటికి పంపిణీ చేయడం ప్రారంభించింది. కాలక్రమేణా పరిశ్రమకు సంబంధించిన మరింత సమాచారాన్ని రైతులకు అందజేస్తున్నాం.
కోలార్ మామిడి పండ్లను పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు కూడా పంపిస్తున్నారని భాస్కర్ రెడ్డి తెలిపారు. రైతుల ఉత్పత్తి అంతా సిద్ధమైన తర్వాతే మామిడి బోర్డు పంపడం ప్రారంభిస్తుంది.
భాస్కర్ మాట్లాడుతూ , ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం వెబ్‌సైట్‌ను రెండు రోజుల క్రితమే తెరవడం జరిగిందని , వారికి ఇప్పటికే పదికి పైగా ఆర్డర్‌లు వచ్చాయని , అయితే పెద్ద ఎత్తున ఆర్డర్‌లు పొందడం ప్రారంభించే వరకు పెద్దగా లాభం ఉండదని అన్నారు. ప్రస్తుతానికి మేము మామిడి పండ్ల నాణ్యత మరియు లాభదాయకత కంటే కస్టమర్ సంతృప్తి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాము.
ఇది కూడా చదవండి..
Share your comments