News

రేషన్ కార్డ్ కొత్త నిబంధనలు..కేంద్రం నిర్ణయంతో ప్రజలకు తీపి కబురు

Gokavarapu siva
Gokavarapu siva

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేయనుంది. ఈ కొత్త నింబంధనలు దేశంలోని రేషన్ షాపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనితో రేషన్ వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సన్నాహాలను చేస్తుంది.

త్వరలో రేషన్ షాపుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పరికరాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పరికరంతో రేషన్ షాపుల్లో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ కొత్త నిభంధన ప్రకారం, త్వరలో రేషన్ దుకాణాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరాలను తప్పనిసరి చేశారు. ఈ పరికరంతో దుకాణాల్లో తూకం విషయంలో తప్పులు జరగవు అని అధికారులు చెబుతున్నారు.

రేషన్ కార్డ్ షాపుల్లో అక్రమాలను నివారించేందుకు కొత్త పరికరం ప్రవేశ పెట్టనుంది. దీని వల్ల రేషన్ కార్డ్ హోల్డర్లు పెద్ద ప్రయోజనం పొందుతారు. ఈ యంత్రాలను రేషన్ షాపులకు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ఈ ఐపీఓఎస్‌(IPOS) యంత్రాలు లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు వీలు లేదని కేంద్రం సృష్టం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలను పొందేందుకు వీలుగా రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ స్కేల్స్‌తో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) పరికరాలను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చట్టం నిబంధనలను సవరించింది.

ఇది కూడా చదవండి..

లాభసాటిగా నిమ్మ.. భారీగా డిమాండ్.. దిగుబడులు అంతంత మాత్రమే

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెరుగుపరచటానికి జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార ధాన్యాల తూకాల్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆ నిబంధన తెచ్చింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా దేశంలోని ప్రజలకు కిలోల బియ్యాన్ని, గోధుమలను అందిస్తుంది. బిపిఎల్ కార్డు హోల్డర్లకు డిసెంబర్ 2023 వరకు ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి..

లాభసాటిగా నిమ్మ.. భారీగా డిమాండ్.. దిగుబడులు అంతంత మాత్రమే

Share your comments

Subscribe Magazine