Agripedia

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ

Srikanth B
Srikanth B

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పంట వరి రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు 70 లక్షల ఎకరాలలో వరి సాగవుతోంది . అయితే రైతు సోదరుల పంటలను ఆశించే తెగుళ్ళ ను నివారించడం లో సతమతం అవుతుంటారు.అటువంటి తరుణంలో వరిలో ఆశించే ప్రధాన తెగుళ్ళు మరియు వాటి నివారణ గురించి కింద వివరించబడింది .

అగ్గి తెగులు లేక మెడ విరుపుతెగులు
ఆకుల పై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగుగల నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్వడతాయి.ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి.వెన్నుల మెడభాగంలో ఈతెగులు ఆశి౦చి వెన్నులువిరిగిపోతాయి.

తట్లుకొను శక్తి గల రకాలనుసాగుచేయాలి.కిలో విత్తనానికి ౩ గ్రా.కార్భ౦డజియ్ కలిపి విత్తనశుద్ది చేయాలి.ట్రైసైక్లోజోల్ 75 శాతం 0.6గ్రా లేదా ఎడిఫెన్ఫాన్ 1 మి.లీ.లీటరు నీటికి కలిపి పైరు పైపిచికారి చేయాలి.చేనులోను,గట్లపైన కలుపు నివారించాలి.

పొడతేగులు లేక మాగు తెగులు
దుబ్బు చేసె దశ నుండి కా౦డ౦/మట్ట/ఆకులపై మచ్చలు పెద్దవై పాముపోడ మచ్చలుగా ఏర్పడుతు౦ది మొక్కలు,పైరు పూర్తీగా ఎండిపోతాయి.

నివారణ
విత్తనశుద్ధి, సిఫారసు చేసిన నత్రజనిని ౩-4 సార్లు వేయాలి.గట్ల పెన ,చెనులో కలుపు లేకుండా చూదాలి.ప్రోపికోనజోల్ 1 మి.లీ.లేక హెక్సాకోనజోల్ 1 మి.లీ .లేక వాలిడామైసిన్ 2 మి.లీ .లీటరు నీటికి కలిపి 15రోజులకొకసారి రెండు పర్యాయాలు మ౦దు ద్రావణాన్ని పిచికారి చేయాలి.

వరిలో సమర్ధవంతమైన నారుమడి తయారీ విధానం -యాజమాన్యం & మెళుకువలు...

ఆకు ఎండు తెగులు
ఇది బాక్టీరియా వల్ల వస్తుంది.ఆకుఅంచుల నుండి పసుపురంగు నీటిడాగు మచ్చలుగా ఏర్పడి ఆకుల పైనుండి క్రీందికి ఎండిపోతాయి.

నివారణ
తట్టుకొనుశక్తి గల రకాలను సాగు చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పంటనుండి విత్తనాన్ని సేకరించాలి .నత్రజని యాజ'మాన్యం (౩-4 సార్లు వేయడం) తప్పక చేయాలి. తెగులు 5 శాత౦ కంటె ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా నిలుపుచేయాలి.

 

కా౦డ౦ కుళ్ళు తెగులు
ఆకుతోడిమ పై నల్లటిమచ్చలు ఏర్పడి,లోపలి కా౦డానికి విస్తరించి కణపుల మధ్య భాగమ౦తా సల్లగా మరుతాయి ఆకులు పసుపు రంగుకు మారిపిలకలు చనిపోతుంటాయి .పాలు పోసుకునే దశలో కా౦డ౦ ప్రదేశందగ్గర విరిగి పోతు౦ది.

నివారణ
తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి.విత్తనశుద్ధిచేయాలి.ప్రారంభ దశలోతెగులు లక్షణాలను గుర్త౦చి వాలిడామైసిన్(2.మి.లీ) లేదా హెక్సాకోనాజో ల్(2.మి.లీ.) లీటరునీటికి కలిపిన ద్రావాన్ని 15 రోజుల కొకసారి 2 సార్లు పిచికారి చేయాలి.

టు౦గ్రో వైరన్
ఈ వైరస్ పచ్చదిపపు పురుగులవలన వ్యాపిస్తుంది. వైరన్ పోకిన మొక్కలు కురచుగా,ఎదగక,పిలకలుతగ్గిపోయి,ఆకులు చివరల నుండి లేత ఆకుపచ్చ లేక నారింజ రంగు లోకి మారుతాయి.ముదురు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడుతాయి,వైరస్ ఆశించిన మొక్కల నుండి వెన్నులు రావు.వచ్చినా చిన్నవిగా ,గింజలు గట్టిపడక తాలుగా మారుతాయి.

నివారణ
ఈ వైరన్ అశించిన మొక్కలను గురించిన వెంటనే తీసి నాశన౦ చేసి పచ్చదీపపు పురుగులను నివారించాలి.

వరిలో సమర్ధవంతమైన నారుమడి తయారీ విధానం -యాజమాన్యం & మెళుకువలు...

పొట్టికుళ్ళు తెగులు
పోతాకు తొడిమల పై నల్లటి లేదా గోధుమ రంగు/మచ్చలుఏర్పడి వెన్నులు పోత్తిలో కుళ్ళిపోతాయి.వెన్న పాక్షికంగామాత్రమే బయటకు వస్తు౦ది.

నివారణ
ఈ వైరన్ పొట్టదశలో ఒకపారి,7 రోజుల తరువాత రెండవపారి కర్చండజిమ్ 50 శాత౦ మ౦దు లీటరు నీటికి 1 గ్రాము చొప్పునకలిపి పిచికారి చేయాలి.


మానిపండు తెగులు
ఇదిపూత దశలో వస్తుంది.అండాశయ౦ ,శిలీంద్ర౦ వల్లి ఆకుపచ్చరంగు ముద్దగా మారి అబీవృద్ది చెంది ,పసుపురంగులోకి మారి చివరకు నల్లబడి పోతుంది.

నివారణ
కర్చ౦డజిమ్ 1(గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి ,వారం రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయాలి.

గమనిక : పైన సమాచారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుంచి సేకరించబడినది .

వరిలో సమర్ధవంతమైన నారుమడి తయారీ విధానం -యాజమాన్యం & మెళుకువలు...

Related Topics

pest attack Paddy Crop

Share your comments

Subscribe Magazine