భారతదేశం పండ్ల తోటల సాగులో అగ్ర స్థానంలో ఉంది. విస్తీర్ణం ప్రకారం చూస్తే మొదటగా మామిడి , అరటి తరువాత తర్వాత నిమ్మ జాతి పంటలు ఉన్నాయి ఉత్పత్తి విషయంలో మొదటది అరటి రెండవది మామిడి తర్వాత నిమ్మ జాతి పండ్లు మూడవ స్థానాన్ని ఆక్రమించాయి. మన దేశంలో పండే నిమ్మజాతి పండ్లకి విదేశాల్లో కూడా మంచి డిమాండ్ కూడా ఉంది. వీటిని ఎక్కువగా స్పెయిన్,నెథర్లాండ్స్,జర్మనీ,ఇజ్రాయెల్ మరియు సౌత్ ఆఫ్రికా వంటి విదేశాలకి ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది. మిగితా దేశాలతో పరిగణిస్తే మన దేశంలో నిమ్మ జాతుల పండ్ల దిగుబడి కాస్త తక్కువగానే ఉంది.
నిమ్మ జాతి చెట్ల జీవిత కాలం సుమారుగా 15 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది అప్పటి వరకు నాణ్యతమైన నిమ్మ ఫలాలను అందిస్తాయి. ఇప్పుడు నిమ్మ జాతి పండ్లలో అధిక దిగుబడినిచ్చే మెళకువలను తెలుసుకుందాం.
వాతావరణం:
నిమ్మ జాతి మొక్కలు 130డిగ్రీల సెల్సియస్ నుండి 37 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య బాగా పెరుగుతాయి. ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెల్సియస్ కింద ఉంటే మొక్కలకి పెరుగుదలకు హానికరం. నేల ఉష్ణోగ్రత సుమారుగా 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. మంచు కూడా మొక్కల పెరుగుదాల్ని నిరోధిస్తుంది. అధిక తేమ, అధిక వర్షపాతం వంటి అంశాలు కూడా మొక్కల పెరుగుదలకు అంత శ్రేయస్కరం కాదు.
అనువైన నేలలు:
నేల యొక్క ఉదజని సూచిక (pH value) 5.5 నుండి 7.5 మధ్య ఉన్నవాటిలో మంచి దిగుబడి ఉంటుంది.ఎర్ర నేలలు ,ఒండ్రు నేలలు మరియు నీటి పారుదల ఉండి తేలికపాటి నేలలు.
ముఖ్యమైన రకాలు:
సాత్గుడి, కాగ్జి లైమ్, రంగాపూర్ లైమ్,బటావియన్ , మోసంబి, బ్లడ్ రెడ్ మరియు వాషింగ్టన్ సోవెల్ వంటి అధిక దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయి.
అంట్లను ఎంచుకునేటప్పుడు వాటికి ఎటువంటి వ్యాధులు మరియు తెగుళ్లు లేకుండా చూసుకోవాలి. కణుపుల మధ్య దూరం తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.
నాటే దూరం: సాధారణంగా మొక్కల మధ్య దూరం 6మీ* 6మీ ఉండేట్లు చూసుకోవాలి.
నీటి పారుదల:
మొక్క ప్రారంభ దశలో క్రమం తప్పకుండా నీటిని అందివ్వాలి. పొలం యొక్క స్వభావం వాతావరణంని బట్టి కూడా ఎంత మోతాదులో నీటిని అందివ్వాలి అనేది నిర్ణయించబడుతుంది.మొక్కలు పూత మరియు పిందె దశల్లో ఉన్నప్పుడు నీటిని క్రమం తప్పకుండ ఇవ్వాలి.
ఎరువుల యాజమాన్యం:
మొక్కలకి పోషకాలు అందివ్వడానికి సేంద్రీయ ఎరువులు వాడటం శ్రేయస్కరం. మొక్కల వయస్సుని బట్టి ఎరువులని వేసుకోవాలి
మొదటి సంవత్సరం :(ప్రతి మొక్కకి/సంవత్సరానికి (గ్రాముల్లో)
నత్రజని:100
భాస్వరం :50
పోటాష్:25
రెండవ సంవత్సరం :
నత్రజని:200
భాస్వరం :100
పోటాష్:50
మూడవ సంవత్సరం:
నత్రజని:300
భాస్వరం :150
పోటాష్:75
నాల్గొవ సంవత్సరం:
నత్రజని:400
భాస్వరం :200
పోటాష్:200
ఐదొవ సంవత్సరం :
నత్రజని:450
భాస్వరం :200
పోటాష్:200
నిమ్మ జాతి పంటల్లో నత్రజని లోపిస్తే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది మరియు ఆకులు పసుపు రంగులోకి మారుతాయి . భాస్వరం లోపిస్తే ఆకులు ఎరుపు రంగులోకి మారుతాయి. పోటాష్ లోపిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.
తెగుళ్లు:
బంక తెగులు: ఈ తెగులు మొక్కల పాదుల వస్తుంది. దీని వలన ఎండిపోతాయి. దీని నివారణకై లీటర్ నీటికి ఒక గ్రాము కార్బెన్డిజమ్ కలుపుకొని పిచికారీ చేయాలి.
బూడిద తెగులు;
చలికాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది దీనివలన పిందెలు రాలిపోతాయి నివారణకై లీటర్ నీటికి 3 గ్రాముల గంధకాన్ని కలిపి పిచికారీ చేయాలి
వేరుకుళ్లు తెగులు:
నిమ్మ జాతి మొక్కల్లో ఈ తెగులు చాల ప్రమాదకరమైనది. వేరు వ్యవస్థ కుళ్లిపోయి మొక్కకి పోషకాలు మరియు నీరు అందక చెట్టు చనిపోతుంది. దీని నివారణకై రెండు గ్రాముల కార్బెన్డిజంని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరిన్ని చదవండి
Share your comments