Agripedia

Mango: కృత్రిమంగా పండించిన మామిడి పళ్ళను మార్కెట్లో గుర్తించడం ఎలా ?

KJ Staff
KJ Staff

వేసవి సమీపించడంతో , అందరు తమకు ఇష్టమైన మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ డిమాండ్ ను సొమ్ముచేస్కోడానికి మామిడిపళ్ళను త్వరగా పండేలా చేయడానికి ఎన్నో హానికరమైన ప్రక్రియలు చేస్తుంటారు వ్యాపారాలు.

మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని విస్తృతంగా వాడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఆహార వ్యాపార నిర్వాహకులు, విక్రయదారులకు మామిడికాయల పక్వ ప్రక్రియను వేగవంతం చేయడానికి చట్టవిరుద్ధమైన మరియు అనైతిక పద్ధతులను ఆశ్రయించవద్దని హెచ్చరిక జారీ చేసింది.

కాల్షియం కార్బైడ్ అనేది అత్యంత విషపూరితమైన పదార్థం, ఇది చర్మపు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు మరియు క్యాన్సర్‌తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల ఆర్సెనిక్ మరియు ఫాస్పరస్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఏర్పడతాయని FSSAI హెచ్చరించింది. ఈ రసాయనాలు శరీరంలో పేరుకుపోయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

వీటిని సమూలంగా మనం అరికట్టలేము కానీ, మార్కెట్ లో పళ్ళు కొనేటప్పుడు ఏవి సహజంగా పండినవో, ఏవి కృత్రిమంగ పండినవో తెలుసుకుంటే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించొచ్చు. అది తెలుసుకోడం ఎలానో చూద్దాం:

1. పండ్ల దుకాణంలో పేర్చబడిన మామిడిపండ్లు అన్ని ఒకే రంగులో , మెత్తగా ఉంటే, అవి కృత్రిమంగా పండినవి కావచ్చు.

2. మామిడి పళ్లను తీసుకుని వాటి వాసన చూస్తే ఆ సహజసిద్ధమైన మామిడి పళ్ల వాసన కొంచం కూడా రాదు.

3. కొనుక్కొని ఇంటికి రాగానే బకెట్ లో నీళ్లు నింపి అందులో మామిడి పండ్లను వేస్తె , ఒకవేళ కృత్రిమంగా పండిస్తే కార్బైడ్ అనే విషపదార్థం ఉండడంతో పండ్లు పైకి తేలుతాయి.

4. సహజంగా పండినట్లయితే, అవి నీటిలో మునిగిపోతాయి.

ఇది కూడా చదవండి

విదేశాల్లో మన 'బంగినపల్లి' మామిడి పండ్లకు మంచి క్రేజ్..


5. కృత్రిమంగా పండిన మామిడి పండ్లు అతిగా మెత్తగా ఉన్నందున మామిడికాయల మాదిరిగా కోయడం కష్టం.

6. కృత్రిమంగా పండిన మామిడి గింజల చుట్టూ ఉండే గుజ్జు తెల్లగా ఉంటుంది.

7. మామిడికాయలు 5 దశల్లో పండుతాయి, కాండం క్రింది నుండి కొన వరకు, అవి ఒకే రంగులో ఉండవు, అవి మిశ్రమ రంగులైతే, పండ్లు సహజంగా పండినవి.

8. కృత్రిమంగా పండిన మామిడి పండ్ల సహజ రుచి లేకుండా పుల్లగా ఉంటుంది.

మామిడి పండ్లను కృత్రిమంగా పండించారా లేదా సహజంగా పండించారా అని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు.

మనం సగజ సిద్ధమైన ఆహారాలను వెతికి కనుగొనే జీవనశైలిలో మరియు సమాజంలో జీవించడం విచారకరం. సాధ్యమైనంత మంచి సహజమైన ఆహారాన్ని తిని ప్రజలందరూ సంతోషంగా జీవించండి.

ఇది కూడా చదవండి

విదేశాల్లో మన 'బంగినపల్లి' మామిడి పండ్లకు మంచి క్రేజ్..

 

Share your comments

Subscribe Magazine