Agripedia

గులాబీలో సస్యరక్షణ

KJ Staff
KJ Staff
Climber Rose
Climber Rose

పూలల్లో చాలామంది ఎక్కువగా ఇష్టపడేది వాటి అందమైన రూపాన్ని.. ఆ తర్వాత వాటి ఆహ్లాదకరమైన వాసనని. అలా అందమైన రూపం, వాసన రెండూ ఉన్న పూలలో ఎక్కువ మంది ఇష్టపడేవి గులాబీ పూలు.

అందుకే వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది రైతులు గులాబీలను తోటల్లో వేసి పెంచడం చేస్తుంటారు. సాధారణంగా గులాబీ మొక్క నాలుగు నుంచి ఆరు అంగుళాల ఎత్తు పెరుగుతుంది. గులాబీ కాండంలో ముళ్లు కూడా ఉంటాయి. దక్షిణాదిలో ఈ పూలను ఎక్కువగా చలి కాలంలో పండిస్తారు. ఈ మొక్కల ఆకులు కూడా ముళ్లు ఎక్కువగానే ఉంటాయి. కాండంతో పాటు ఆకులు కూడా ముళ్లుగా ఉన్నా పూలు మాత్రం అందంగా ఉండడం వీటి ప్రత్యేకత. గులాబీ పంటలో ఎండాకాలం సమయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ రైతులు చాలా సక్సెస్ ఫుల్ పద్ధతులు వాడుతూ మంచి లాభాలు పొందుతున్నారు. వారు పాటించే పద్ధతుల్లో కొన్ని..

చలి కాలం నుంచి వసంతం లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ మొక్క వేగంగా పెరుగుతుంది. ఇలాంటప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ నీళ్లు అందించాలి. చుట్టూ ఉన్న అనవసరమైన మొక్కలన్నింటినీ తొలగించుకోవాలి. వాతావరణం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. దీనికోసం గులాబీ మొక్కల్లో పురుగు మందులు జల్లాల్సి ఉంటుంది. గులాబీ పంటలో ఎక్కువగా కొండి పురుగు, పేను వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు తప్పనిసరిగా మందులు వాడాలి. ఇవి ఎక్కువగా ఎండాకాలంలో ఎదురవుతాయి. వీటి నుంచి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

పురుగుల నుంచి ఇలా కాపాడుకోండి..

తోటలో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

పురుగు పట్టిన కొమ్మలు, ఆకులు కట్ చేసి తీసేసి దూరంగా పడేయాలి.

రెండు గ్రాముల డైమిథోయేట్ ని లీటర్ నీటిలో కలిపి ప్రతి పదిహేను రోజులకోసారి చిలకరించాల్సి ఉంటుంది.

పది నుంచి పదిహేను గ్రాముల ఫోరేట్ ని ప్రతి మొక్క మొదట్లో నీటిలో కలిపి పోయాల్సి ఉంటుంది.

ప్రూనింగ్ చేయండి.

గులాబీ మొక్కల్లో ఒకటి, రెండు రెక్కలు పూసినట్లుగా అవ్వగానే వాటిని మొక్క నుంచి సపరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం షార్ప్ గా ఉన్న కత్తెరలు, బ్లేడ్స్ ఉపయోగించాలి. ఆ తర్వాత వెంటనే వాటిని నీళ్లు నింపిన కంటెయినర్ లో ఉంచి కోల్ట్ స్టోరేజ్ లో పెట్టాలి. వీటిలో ఉష్ణోగ్రత కేవలం 10 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రతలోనే అవి నెమ్మదిగా పూస్తుండగా గ్రేడింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మార్కెట్ కి పంపవచ్చు. ఈ పద్ధతిని ప్రూనింగ్ అంటారు. ఈ పూలు కనీసం నాలుగు రోజుల పాటు ఫ్రెష్ గా ఉండేందుకు బర్డ్ క్యాప్స్ ని ఉపయోగించాల్సి ఉంటుంది.

లాభాలు ఎలా ఉంటాయంటే..

సీజన్ ని బట్టి ఈ పంటలో లాభాలు కనిపిస్తుంటాయి. ఒక్కో కేజీ పువ్వులు మార్కెట్లో నలభై నుంచి 120 రూపాయలకు అమ్ముడుపోతున్నాయని.. అవి ఎండలు కాస్త ముదిరితే 150 రూపాయలు కూడా అవ్వచ్చని రైతులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, వేలంటైన్ సీజన్ లో ఎక్కువ ఖరీదు పెట్టి వీటిని కొనుగోలు చేస్తారట. అప్పుడు కేజీ రూ. 500 అమ్ముడుపోయినా ఆశ్చర్యం లేదు.

Share your comments

Subscribe Magazine