మన భారతీయ వంటకాలలో ఎంతో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. అయితే పసుపు పంటను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చునని గుజరాత్ రాష్ట్రం రాష్ట్రంలోని సాబర్‌కంఠా జిల్లా రైతులు ఇజ్రాయెల్ టెక్నిక్‌తో గ్రీన్ హౌజ్ విధానంలో పసుపు పంట సాగు చేస్తూ ఎకరాకు కోట్లలో ఆదాయాన్ని పొందుతూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాబర్‌కంఠా జిల్లాలోని ఒక రైతు ఇజ్రాయిల్ పద్ధతిని ఉపయోగించి పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఈ విధంగా పసుపు పంటను సాగు చేయడానికి గ్రీన్ హౌస్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గ్రీన్ హౌస్ ఏర్పాటు చేస్తే పంటకు తగిన వాతావరణ పరిస్థితులను కల్పించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇస్రాయిల్ దేశంలో ఈ విధంగా తక్కువ భూమి విస్తీర్ణంలో ప్రజలు అధిక దిగుబడి పొందే విధానాన్ని చంద్రకాంత్ పటేల్ అనే రైతు అనుసరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
చంద్రకాంత్ తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సుమారు పది కోట్లు ఖర్చు చేసి గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసి డ్రిప్ సిస్టమ్ ద్వారా గాల్వనైజ్డ్ ట్రే సిస్టమ్‌లో పసుపు మొక్కలు నాటారు. అంటే.. షెడ్డులో నాలుగు, ఐదు వరుసలు ఉండే నిలువ ట్రేలలో పంటను సాగు చేశాడు. ఈ విధంగా ఎకరానికి 500 నుంచి 800 టన్నుల వరకు ఉత్పత్తిని సాధించారు. ఈ క్రమంలో ఎకరాకి 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు. ఈ విధానంలో పసుపు సాగు చేయడానికి ఇతర రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసుకోవడానికి రాయితీలను కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Share your comments