సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి?
సాంప్రదాయిక వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం ,రసాయన ఎరువుల వాడకం ఉంటుంది, అయితే ఇవి నేల సారాన్ని తగ్గిస్తాయి మరియు భూమి క్షీణతకు దారితీస్తాయి, అలాగే విస్తృతమైన రసాయన కాలుష్యం నికి దారితీస్తాయనేది వాదన , దీనికి భిన్నమైనది సేంద్రీయ వ్యవసాయం అనగా రసాయన ఎరువులను, రసాయన పురుగు మందులను వాడకుండా కేవలం ప్రకృతి ఆధారిత జీవ ఎరువులను ఉపయోగించి పంట ఉత్త్పత్తిని పొందడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు .
సేంద్రీయ వ్యవసాయం అనేది ఎక్కువగా రసాయన రహిత ఆహార ఉత్పత్తి తో ముడిపడి ఉన్నా అంశం మరియు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడి రైతులు సాదించగలరా అనేది ప్రశ్న ? గత కొంత కాలం గ , సేంద్రీయ వ్యవసాయం విమర్శలకు గురి అవుతోంది, ఇది నిజంగా వ్యవసాయ క్షేత్రాలలో సామాన్య రైతు సేంద్రియ వ్యవసాయ విధాన్ని అనుసరించి అధిక దిగుబడులు సాధించగలడా అనే సందేహాలను రేకెత్తిస్తోంది. నానాటికీ పెరుగుతున్న ప్రపంచ జనాభా కు ఈ ప్రాచీన పద్ధతి ద్వారా ఆహారాన్నిసమకూర్చగలమా అనే అంశాల పై "కృషి జాగరణ్ ఆంధ్రప్రదేశ్" అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ , తిరుపతి "M భాస్కరయ్య" గారితో వెబినార్ ను నిర్వహించింది.
ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ , తిరుపతి జిల్లా "M భాస్కరయ్య" గారు మాట్లాడుతూ "సేంద్రియ వ్యవసాయం అనేది కొందరు వ్యాపార ప్రయోజనలు పొందడానికి కల్పిస్తున్నటువంటి భ్రమ, ఎందుకంటే ఆహారం అనేది ఆరోగ్యం తో ముడిపడి న అంశం గ చిత్రీకరణ జరిగిందని, వాస్తవానికి ఉదయం లేచినపుడు నుంచి సాయంత్రం వరకు అనేక జీవన క్రియలలో రసాయనాల వాడకం జరుగుతుందని అయినా వీటిని ఎవ్వరు ప్రశ్నించారు ,కానీ వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తుల పై మాత్రం విమర్శలు చేస్తారని , రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి యొక్క సారం తగ్గి పోతున్న మాట వాస్తవ మే అయినప్పటికీ వాటికీ 'ప్రత్యామ్న్యాయ ఎరువులు' రసాయన ఎరువుల స్థాయిలోప్రభావం చూపగల ఎరువులను రైతులు సమకూర్చుకునే విధం గ పరిజ్ఞానం అందించాల్సిన అవసరముందని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్, FY 2021-22లో పండ్ల ఉత్పత్తిలో అగ్రగామి!
Share your comments