Agripedia

Organic farming :"రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్న్యాయంగా సేంద్రియ వ్యవసాయం దిశగా రైతును ప్రోత్సహించాలి"-M భాస్కరయ్య

Srikanth B
Srikanth B
సేంద్రియ వ్యవసాయం  గురించి వివరిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ , తిరుపతి జిల్లా  "M భాస్కరయ్య "
సేంద్రియ వ్యవసాయం గురించి వివరిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ , తిరుపతి జిల్లా "M భాస్కరయ్య "

సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి?

సాంప్రదాయిక వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం ,రసాయన ఎరువుల వాడకం  ఉంటుంది,   అయితే  ఇవి నేల సారాన్ని తగ్గిస్తాయి మరియు భూమి క్షీణతకు దారితీస్తాయి, అలాగే విస్తృతమైన రసాయన కాలుష్యం నికి దారితీస్తాయనేది వాదన , దీనికి భిన్నమైనది  సేంద్రీయ వ్యవసాయం అనగా రసాయన ఎరువులను, రసాయన పురుగు మందులను  వాడకుండా కేవలం ప్రకృతి ఆధారిత జీవ ఎరువులను ఉపయోగించి పంట ఉత్త్పత్తిని పొందడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు .

సేంద్రీయ వ్యవసాయం  అనేది ఎక్కువగా రసాయన రహిత ఆహార ఉత్పత్తి తో ముడిపడి ఉన్నా  అంశం  మరియు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ  ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడి రైతులు సాదించగలరా అనేది ప్రశ్న ?  గత కొంత కాలం గ , సేంద్రీయ వ్యవసాయం విమర్శలకు గురి అవుతోంది, ఇది నిజంగా వ్యవసాయ క్షేత్రాలలో సామాన్య రైతు సేంద్రియ వ్యవసాయ విధాన్ని అనుసరించి అధిక దిగుబడులు సాధించగలడా  అనే సందేహాలను రేకెత్తిస్తోంది. నానాటికీ పెరుగుతున్న ప్రపంచ జనాభా కు ఈ ప్రాచీన పద్ధతి ద్వారా ఆహారాన్నిసమకూర్చగలమా  అనే అంశాల పై "కృషి జాగరణ్ ఆంధ్రప్రదేశ్"   అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ , తిరుపతి  "M భాస్కరయ్య" గారితో  వెబినార్  ను నిర్వహించింది.

ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ , తిరుపతి జిల్లా  "M భాస్కరయ్య"   గారు మాట్లాడుతూ  "సేంద్రియ వ్యవసాయం అనేది కొందరు వ్యాపార ప్రయోజనలు  పొందడానికి కల్పిస్తున్నటువంటి భ్రమ, ఎందుకంటే ఆహారం అనేది ఆరోగ్యం తో ముడిపడి న అంశం గ చిత్రీకరణ జరిగిందని, వాస్తవానికి ఉదయం లేచినపుడు నుంచి సాయంత్రం వరకు అనేక జీవన క్రియలలో రసాయనాల వాడకం జరుగుతుందని అయినా వీటిని ఎవ్వరు ప్రశ్నించారు ,కానీ  వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తుల పై మాత్రం విమర్శలు చేస్తారని , రసాయన ఎరువులు వాడడం వల్ల  భూమి యొక్క సారం తగ్గి పోతున్న మాట వాస్తవ మే అయినప్పటికీ వాటికీ 'ప్రత్యామ్న్యాయ ఎరువులు' రసాయన ఎరువుల  స్థాయిలోప్రభావం చూపగల ఎరువులను రైతులు సమకూర్చుకునే విధం గ పరిజ్ఞానం అందించాల్సిన అవసరముందని అభివర్ణించారు.

ఆంధ్రప్రదేశ్, FY 2021-22లో పండ్ల ఉత్పత్తిలో అగ్రగామి!

 

Share your comments

Subscribe Magazine