Agripedia

అరటి సాగులో మెళకువలు.. ఇలాచేస్తే లక్షల్లో ఆదాయం?

KJ Staff
KJ Staff

కాలాలతో సంబంధం లేకుండా పండే పంటలలో అరటి ఒకటి. మార్కెట్లో అరటికి ఎంతో డిమాండ్ ఉంది.పోషక విలువలు అధికంగా కలిగిన ఈ అరటి అన్ని కాలలో దిగుబడిని ఇస్తూ రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది.అరటి సాగులో సరైన మెలుకువలు సాగు పద్ధతులను పాటిస్తే రైతులు తక్కువ పెట్టుబడితో లక్షలలో ఆదాయాన్ని పొందవచ్చు. మరి అరటి సాగును ఏ విధంగా చేయాలి? ఇలా చేయటం వల్ల అధిక లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. మరి వారి ప్రకారం అరటి సాగు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం...

ముందుగా అరటి సాగు చేయటానికి ఎంతో అనువైన భూమిని ఎంచుకోవాలి. ఒక మొక్క నుంచి మరొక మొక్కకు మధ్య సుమారు 6 అడుగుల దూరం పాటించాలి. ఈ విధంగానే ఆరు అడుగుల దూరంలో ఒక గోతిని తవ్వాలి. అరటి మొక్కలను నాటడానికి 50 సెంటీమీటర్ల వెడల్పు, పొడవైన గుంతలను తీయాలి. ఒక ఎకరానికి సుమారుగా 1250 అరటి మొక్కలను సాగు చేయవచ్చు.ఈ విధంగా తీసిన గుంతలను 15 రోజుల పాటు బాగా ఎండనిచ్చి అందులోకి ఎరువులు వేసుకోవాలి.

10 కిలోల ఆవు పేడ,250 గ్రాముల వేప, 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుంతలలో వేయాలి. ఈ విధంగా ఒక ఎకరానికి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి వస్తుంది. సరైన సమయంలో సరైన మెలుకువలు పాటిస్తే ఒక ఎకరానికి సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. అరటి పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి కనుక అరటి పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అరటి మొక్క వేర్లు లోతుగా వెళ్ళవు కనుక నీటి లభ్యత విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా తరచూ అరటి మొక్కలు చుట్టూ కలుపు తీస్తూ సరైన సమయానికి సరైన మందులను పిచికారి చేయడం వల్ల పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ విధమైనటువంటి మెలకువలు పాటించడం వల్ల రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine