Agripedia

వేరుశెనగ పంటను ఆశించే ప్రధాన పురుగులు మరియు వాటి నివారణ

Gokavarapu siva
Gokavarapu siva

తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ పంటకు పత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ వేరుశెనగ ఉత్పత్తిలో భారతదేశంలో 4వ స్తతంలో ఉంది. వేరుశెనగ పంటను అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణ మొదలగు జిల్లాలో అధికంగా సాగు చేస్తారు. కానీ ఈ పంటను ఆశించే పురుగుల సమస్య బాగా ఎక్కువగా ఉండటం వలన రైతులు నష్టపోతున్నారు. ఐతే ఈ పంటను ఆశించే ప్రధాన పురుగులు మరియు వాటి నివారణ గురించి తెలుసుకుందాం.

వేరు పురుగు: వర్షాలు పడిన వెంటనే భూమి నుండి ఈ వేరు పురుగు యొక్క తల్లి పురుగులు బయటకు వస్తాయి. ఇవి చుట్టు ప్రక్కల ఉన్న వివిధ రకాల చెట్లను ఆశిస్తాయి. మరియు ఆడ పురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. ఈ పిల్ల పురుగులు తెల్లటి రంగులో ఉంటాయి. వేరు పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి. పండిపోయి చనిపోతాయి మొక్కలను పీకితే సులువుగా ఊడివస్తాయి. మొక్కలు గుంపులు, గుంపులుగా చనిపోతాయి.

నివారణ:
వీటిని నాశనం చేయడానికి భూమిని లోతుగా దున్నుకోవాలి. ఇలా చేయడం వలన ఈ పురుగులు బైటకి వచ్చి సూర్యరశ్మికి చనిపోతాయి, లేదా పక్షులు తింటాయి. వేరు పురుగులు నివారణకు ఫోరెట్‌ 10% గుళికలు ఎకరాకు 6 కిలొలు చొప్ఫున ఇసుకలో కలిపి చల్లుకోవాలి.

పేను బంక పురుగు : పిల్ల మరియు తల్లి పురుగలు యొక్క లేత కొమ్మలు మరియు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి.
నివారణ :
పేను బంక ఉధృతి అధికంగా ఉన్నట్లుగమనించినట్లయితే పసిఫేట్‌ 1:5 గ్రా./లీ. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి

ఆకు ముడత పురుగు :ఈ ఆర్కు ముడత పురుగు వేరుశెనగను విత్తనాలు వేసిన 15 రోజుల నుండి ఆశిస్తుంది. మొదటి దశలో ఆకులపై గోధుమరంగు మచ్చలు ఉంటాయి. వీటి లోపల ఆకుపచ్చరంగులో నల్లని తలకలిగిన పిల్లపురుగులు ఉంటాయి. ఈ పురుగులు పాత్రహారితను తినేయడం వలన ఆకులు అనేవి కాలినట్లు ఉంటాయి, కాబట్టి దీనిని రైతులు అగ్గి తెగులు అని కూడా పిలుస్తారు.

నివారణ :
ఈ పురుగు ఉనికి మరియు ఉదృతి గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. నివారణకు క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ లేదా పసిఫేట్‌ 300 గ్రా. లను 200 లీటర్లు నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి..

మినుము పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు..

తామర పురుగులు: వేరుశెనగ పంటను ఈ తామర పురుగులు ఆశించినప్పుడు గోధుమ, ఇనుము, రంగు మచ్చలు అనేవి ఆకు యొక్క అడుగు భాగాన కనబడతాయి. కాండం కుళ్ళు, మొవ్వ కుళ్ళు పరిస్థితులు ఉన్నప్పుడు వీటి ఉధృతి అధికమవుతుంది.
నివారణ :
తామర పురుగల నివారణకు మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. G వేపనూనె 1లీ. నీటిలో కలిపి పొలంలో పిచికారి చేసుకోవాలి. ధయోమిథాక్సామ్‌ 100 గ్రా.లను 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా తామర పురుగులను నివారించవచ్చు.

పొగాకు లద్దె పురుగు : తల్లి పురుగులు అనేవి గుడ్లను గుంపుగా ఆకు కింద లేదా ఆకు పైన పెడతాయి. బాగా ఎదిగిన పురుగులు మొక్కల అడుగు భాగాన లేదా మట్టిపెళ్ళలు, రాళ్ళకింద దాగి ఉండి రాత్రపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినేస్తాయి.

నివారణ :
పొలంలో 4 లేదా 5 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మెగరెక్కల పురుగులనేవి వీటిని ఆకర్షిస్తాయి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. విషపు ఎరను తయారు చేస్కుని పొలంలో చల్లుకోవాలి. లార్వాలను నివారించడానికి నొవాల్యురాన్‌ 200 మి.లీ లేదా ప్లూబెండామైడ్‌ 40 మి.లీ 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఇది కూడా చదవండి..

మినుము పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు..

Related Topics

groundnut major pests

Share your comments

Subscribe Magazine