Agripedia

మినుము పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు..

KJ Staff
KJ Staff

మన తెలుగు రాష్ట్రాల్లో వరికోతలు అనంతరం మినుమును రబీ, వేసవి పంటలుగా పండిస్తారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 15 లక్షల టన్నుల మినుము పంట ఉత్పత్తి అవుతుంది. ఈ పంటను సాగు చేయడానికి ఖరీఫ్ సీజన్లో జూన్ 15 నుండి జులై 15 వరకు అనుకూలంగా ఉంటుంది. రబీ సీసన్లో ఐతే అక్టోబర్ నెల అనుకూలంగా ఉంటుంది. మినుము పంటను ఆశించే పలు రకాల తెగుళ్ల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మినుము పంటల్లో పల్లాకు తెగులు,సీతాఫలం తెగులు, ఆకు ముడత తెగులు, శిలింధ్ర తెగుళ్లు, కోరినోస్పోరా ఆకు మచ్చ తెగుళ్లు అధికంగా వ్యాపిస్తున్నాయి.

పల్లాకు తెగులు: ఈ తెగులుకు జెమిని వైరస్ కారణం. మినుము పంటకు ఈ జెమిని వైరస్ అనేది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. పంటకు ఈ తెగులు వ్యాపిస్తే మొక్కల ఆకులపైనా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఎక్కవగా వ్యాపిస్తే ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారి, పైరు మొత్తం పసుపు రంగులో కనబడుతుంది. ఒకవేళ పైరును 40-50 రోజల తర్వాత ఆశించినట్లైతే కాయాలి వంకరలు తిరిగి, గింజ యొక్క నాణ్యత తగ్గిపోతాది. మరియు మార్కెట్ లో ధర కూడా తగ్గుతుంది.

నివారణ: పల్లాకు తెగులును తట్టుకునే రకాలైన ఎల్‌.బి.జి. 752, టి.బి.జి 104, ఎల్‌.బి.జి. 787, పి.యు. 31 సాగు చేసుకోవాలి. పొలం చుట్టూ రక్షక పంటగా జొన్న కాని, మొక్కజొన్న కాని నాలుగు వరుసలలో విత్తుకోవాలి. ఈవిధంగా చేయడం వలన వైరస్‌ తెగుళ్ళను వ్యాప్తి చేసే పేనుబంక మరియు తామర పురుగులను ఒక పొలం నుండి వేరొక పొలంకి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.

విత్తన శుద్ధి: పైరు తోలి దశలో ఆశించే పురుగులను నివారించడానికి 5గ్రా. థయోమిథాక్సమ్‌ 70 డబ్ల్యు.ఎస్‌. లేదా 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌. మందుతో విత్తనశుద్ధి చేసుకుని విత్తుకోవాలి. పొలంలో తెగులు మొక్కలను ఆశించే కలుపు మొక్కలను తీసివేయాలి. పొలంలో అక్కడక్కడ 20 గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అమర్చుకోవాలి.

ఇది కూడా చదవండి..

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ

సీతాఫలం తెగులు: దీనిని బొబ్బరాకు తెగులు అని కూడా పిలుస్తారు. ఈ తెగులు అనేది లీఫ్ క్రింకిల్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. పేనుబంక పురుగుల వలన ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకక ఆకులు అనేవి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి. ఈ తెగులు సోకితే సాధారణంగా పూత పూయవు, లేదా పూసిన 15 రోజులు ఆలస్యంగా పూస్తాయి.

నివారణ: తెగులు సోకినా మొక్కలను పీకివేయాలి. ఈ తెగులు అనేది విధానం ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి తెగులు సోకినా మొక్కల నుండి విధానాలను సేకరించకూడదు. పేనుబంక నివారణ కొరకు ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా అసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సమ్‌ 0.2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ఆకు ముడత తెగులు: ఈ తెగులును తలమూడు తెగులు అనికూడా పిలుస్తారు. ఈ వైరస్ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగం లోని ఈనెలు ఎర్రగా రక్త వర్ణాన్ని పోలి ఉంటాయి.

నివారణ: దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టడం ద్వారా పైరు లోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు.తెగులు వ్యాప్తికి కారకమైన తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ఇది కూడా చదవండి..

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ

బూడిద తెగులు :
ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆకులమీద బూడిద లాంటి పొర ఏర్పడటం వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు తగ్గడమే గాక గింజ నాణ్యత కూడా తగ్గుతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిద లాంటి పొర కాండము, పిందెలు మరియు కాయల మీద కూడా వ్యాప్తి చెందుతుంది. రాత్రి పూట చలి గాను, పగటి పూట వేడి గాను ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బూడిద తెగులు ఆశించడానికి మరియు ఉధృతి పెరగటానికి అనుకూలమైనవి.

నివారణ : తెగులు నివారణ కొరకు మైక్లోబ్యుటానిల్‌ 1.0 గ్రా. లేదా హెక్సాకోనజోల్‌ 2.0 మి.లీ లేదా ప్రోపికోనాజోల్‌ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి 10 - 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మందులను మార్చి పిచికారి చేసుకోవాలి.

ఇది కూడా చదవండి..

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ

Related Topics

black gram pests control

Share your comments

Subscribe Magazine