Agripedia

కుండీలలో బంతి పూల సాగు.. రకాలు!

KJ Staff
KJ Staff

మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందంటే తప్పకుండా ఇంటి అలంకరణకు బంతిపూలు ఉండాల్సిందే. కేవలం శుభకార్యం మాత్రమే కాకుండా పండుగలు ప్రత్యేక రోజుల్లో బంతిపూలను అలంకరణలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. మరి ఎంతో అందమైన ఈ బంతి పూలను మన ఇంటి పెరట్లోనే కుండీలలో పెంచుకుంటే ఇంటికి అందాన్ని తెస్తాయి. మరి ఇంటిలోనే కుండీలలో బంతి పూలను ఎలా సాగు చేసుకోవాలి. కుండీలలో పెరిగే బంతి పూలు రకాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

మన ఇంటి ఆవరణంలో ఎక్కువగా ఆఫ్రికన్ బంతి రకానికి చెందిన పువ్వులను పెంచుకుంటారు. ఈ పూల చెట్లను కుండీలలో నాటుకొని సాగు చేస్తారు. ఈ జాతికి చెందిన మొక్కలు ఎత్తుగా పెరిగి పువ్వులు బాగా పెద్ద సైజులో వస్తాయి. ఈ ఆఫ్రికన్ జాతికి చెందిన బంతి పువ్వులలో ఆఫ్రికన్ జెయింట్, ఆరెంజ్ డబుల్, ఆఫ్రికన్ ఎల్లో డబుల్ అనే రకాలు ఉన్నాయి.

ఫ్రెండ్స్ జాతికి చెందిన బంతి పువ్వులను కూడా ఇంటిలో నాటుకోవడానికి ఎంతో అనుకూలమైన అని చెప్పవచ్చు. ఇది కుండీలలో పొట్టిగా గుబురుగా పెరుగుతూ ఒంటి రెక్క పుష్పాలను ఇస్తాయి. ఇవి ఎరుపు, నారింజ, పసుపు వంటి వివిధ రకాలలో లభ్యమవుతాయి. అదేవిధంగా హైబ్రిడ్ బంతి కూడా ఇంటి ఆవరణంలో కుండీలలో పెంచుకోవడానికి ఎంతో అనుకూలమైనవి ఈ విధమైనటువంటి రకానికి చెందిన బంతి పూల విత్తనాలను ట్రేలో వేసి నారును పెంచుతారు.ఈ విధంగా మన ఇంటి ఆవరణంలో కుండీలలో నాటుకోవడానికి ఈ మూడు రకాల బంతి పువ్వులు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More