Agripedia

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ.. ఏకంగా రూ. 15 లక్షలు?

KJ Staff
KJ Staff

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు అనుగుణంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా రైతులకు ఆదాయం రెట్టింపు చేయడానికి, రైతులకు ఆర్థిక మద్దతును అందించడానికి ఈ విధమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతున్నారు.

తాజాగా మోడీ సర్కార్ మరో కొత్త పథకం ద్వారా రైతులకు శుభవార్త తెలిపింది.ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతులు 15 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ఈ పథకం కింద అగ్రికల్చరల్ బిజినెస్ చేసేటటువంటి రైతులకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ విధమైనటువంటి పథకాన్ని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకం ద్వారా 15 లక్షల రుణాన్ని పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడాలి. ఈ విధంగా ఆర్గనైజేషన్ గా ఏర్పడిన రైతులు కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ పథకంలోకి చేరిన రైతులు విత్తనాలను, ఎరువులను, మందులను, వ్యవసాయ పనిముట్లను ఇతరులకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పించింది.

ఈ క్రమంలోనే 2024 వ సంవత్సరానికి గాను ఈ పథకం ద్వారా సుమారుగా 10,000 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధంగా ఏర్పడిన ఆర్గనైజేషన్ సభ్యులు 15 లక్షల రుణం పొంది వారి పనులను ప్రారంభించి రైతులకు ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకం ప్రోత్సహిస్తోందని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine