మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ఠ్య వ్యవసాయంలో తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టవలసిన బాధ్యత రైతులందరి మీద ఉంది. ఈ మధ్య కాలంలో సేంద్రియ వ్యవసాయం మరియు సుస్థిర వ్యవసాయ పద్దతులు అంతులేని ఆధరణ లభిస్తుంది. ప్రజలు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మొగ్గుచూపుతున్నారు. అయితే రైతాంగం మాత్రం సేంద్రియ వ్యవసాయ పద్దతులను అవలంభించడంలో ఇంకా సంకోచిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణాలు అనేకం, అయితే మారుతున్న వాతావరం పరిస్థితులు పెరుగుతున్న ఆహార అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయ పద్దతుల్లో మార్పులుచేర్పులు చెయ్యాలి. వాటిలో మొదటిది సేంద్రియ వ్యవసాయం.
సేంద్రియ వ్యవసాయం సుస్థిర వ్యవసాయంలో ఒక భాగం. అయితే చాల మంది రైతులు, సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా పంట దిగుబడి తగ్గిపోతుందన్న అపోహలో ఉంటారు. కానీ ఇది నిజం కాదు. సరైన పద్దతులను అవలంభిస్తూ ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తే సేంద్రియ వ్యవసాయం నుండి సాధారణ వ్యవసాయం కంటే అధిక లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం మన దేశంలో చాల కొద్దీ మొత్తంలో మాత్రమే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూభాగంలో 2.7% భూమిలో మాత్రమే సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని పెంచేందుకు ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నిస్తుంది. అయినాసరే రైతాంగాని సుస్థిర వ్యవసాయం వైపు సాగేలా చెయ్యడంలో విఫలమయ్యింది. సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పించడంలో లోపం, సేంద్రియ వ్యవసాయానికి కావాల్సిన వనరులు అందుబాటులో లేకపోవడం వంటివి ఈ లోపానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
సేంద్రియ వ్యవసాయ పద్దతులను ఉపయోగించి వ్యవసాయం చెయ్యడం ద్వారా ధీర్ఘకాలికంగా ఎన్నో లాభాలు ఉంటాయి. ముందుగా ఈ పద్దతుల ద్వారా పర్యావరణానికి మరియు జంతువులకు ఎటువంటి హాని కలగదు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయానికి అయ్యే ఖర్చు కూడా తక్కువ సేంద్రియ ఎరువులు మట్టిలో నెమ్మదిగా కరిగి మొక్కకు అవసరమైన పోషకాలను దీర్ఘకాలికంగా అందిస్తాయి. వీటి ద్వారా మరొక్క ప్రయోజనం ఏమిటంటే మట్టిలో కర్బనం శాతాన్ని క్రమేపి పెంచుతూ వస్తాయి. మొక్కలు బలంగా ఎదిగి మంచి దిగుబడిని అందించాడని మట్టిలోని కార్బానం ఉపయోగపడుతుంది. రసాయన ఎరువుల ద్వారా కర్బనం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లోని నేలల్లో మట్టిలో కార్బాన్ శాతం చాల తక్కువుగా ఉంది. పశువులు ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు కర్బన శాతాన్ని పెంచుతాయి. తద్వారా రైతులు సేంద్రియ పద్దతులను పాటించడం వలన పర్యావరణం మెరుగుపరడటమే కాకుండా, కొన్ని కీలక మెళుకువలు ద్వారా అధిక దిగుబడులను కూడా పొందవచ్చు.
Share your comments