Agripedia

శనగ సాగు వివరాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు ఎంపిక...!

KJ Staff
KJ Staff

పప్పు ధాన్యాలు పంటల్లో ఒకటైన శనగ పంట
సాగుకు రాష్ట్రవ్యాప్తంగా అనుకూలమైన వాతావరణం, నేలలు సమృద్ధిగా ఉండడంతో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శనగ పంటను సుమారు 8 లక్షల ఎకరాల్లో సాగుచేస్తూ 4 లక్షల టన్నులు దిగుబడిని సాధిస్తున్నారు.సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అత్యంత అనుకూలం.నల్లరేగడి నెలల్లో నిలువ ఉండే తేమను గ్రహించి, శీతాకాలంలో కురిసే మంచుతోనే పంట పూర్తి అవుతుంది.అక్టోబర్ ,నవంబర్ నెలలో పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.

శనగ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే మొదట మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. విత్తనాలను ఎంపిక చేసుకొనేటప్పుడు మన ప్రాంత వాతావరణానికి,నేలలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తన రకాల వాటి ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శనగ విత్తన రకాలు :

ఐ.సి.సి.వి-10: అక్టోబర్ నెలలో విత్తు కోవడానికి అనుకూలమైన రకం. పంటకాలం 100-110 రోజులు, ఉండి ఎకరాకు 8-10 క్వింటళ్ళు దిగుబడి నిస్తుంది. ఈ మొక్క ప్రత్యేకత నిటారుగా పెరిగి బాగా కొమ్మలు వేస్తుంది.ఎండు తెగులు,వేరుకుళ్లు తెగుళ్ళను సమర్ధవంతంగా తట్టుకుంటుంది.

కె.ఎ.కె.-2 : మొక్క ఎత్తు పెరిగి లావు గింజలను ఇస్తుంది.పంటకాలం 95-100 రోజులు ఉండి ఎకరాకు 8-10 క్వింటళ్ళు దిగుబడినిస్తుంది.

క్రాంతి (ఐ.సి.సి.సి.-37): మొక్కలు గుబురుగా పెరిగి అధిక కాయ దిగుబడినిస్తుంది.పంటకాలం 100-105 రోజులు ఉండి ఎకరాకు 8-10 క్వింటళ్ళు దిగుబడినిస్తాయి. గింజలు మధ్యస్థ లావుగా ఉంటూ, ఎండు తెగులును తట్టుకో గల దేశీయ రకం .

జె.జి 11 : లావుపాటి గింజలు గల దేశీయ రకము. పంటకాలం 100-110 రోజులు ఉండి ఎకరాకు 8-10 క్వింటళ్ళు దిగుబడి వచ్చి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకంతుంది .

శ్వేతా (ఐ.సి.సి.వి.-2): నవంబర్ నెల తర్వాత వేసుకోవడానికి అనుకూలంగా ఉండి, త్వరగా కాపుకు వచ్చే రకం. పంటకాలం 80-85 రోజులు .దిగుబడి ఎకరాకు 6-7 క్వింటళ్ళు. ఎండు తెగులును తట్టుకొనే కాబూలి రకం .

అన్నెగిరి: మెక్క గుబురుగా పెరిగి ,కొమ్మలు ఎక్కువగా వేస్తుంది .గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి .పంటకాలం 100-110 రోజులు. ఎకరాకు 7-9 క్వింటళ్ళు దిగుబడినిస్తుంది.

లామ్ శనగ :మెక్క ఎత్తుగా పెరిగి,లావు గింజ కల కాబూలీ రకం. పంటకాలం 90-95 రోజులు ఉండి ఎకరాకు 8-10 క్వింటళ్ళు దిగుబడినిస్తుంది.

జ్యోతి :మెక్క క్రింద నుండి గుబురుగా కొమ్మలు వేసి,గింజలు గరుకుగా ,మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి.పంటకాలం 100-110 రోజులుఉండి ఎకరాకు 6-7 క్వింటళ్ళు దిగుబడి పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine