మన రాష్టంలో రబీ కాలంలో పండించే పప్పు ధాన్య పంటల్లో పప్పుశనగ ప్రధానమైన పంటగా చెప్పవచ్చు.శీతాకాలం ఆరంభమైన అక్టోబర్ , నవంబర్ మాసాల్లో పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.నవంబర్ తర్వాత విత్తిన పంటకు చీడపీడల సమస్య ఎక్కువగా ఉంది దిగుబడులుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఈ పంట ప్రత్యేకత నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటు శీతాకాలంలో కురిసే మంచుతో పెరిగి అధిక దిగుబడి లభిస్తుంది. రాష్ట్రంలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్న కర్నూలు,గుంటూరు ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.
మన ప్రాంతానికి మన నెలలకు మనవైన విత్తన రకాలను ఎంపిక చేసుకొని భూమిలో అవసరమైన తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి.ఎకరాకు 8 కిలోల నత్రజని,20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరిదుక్కిలో వేసుకోవాలి.
శనగ పూర్తిగా వర్షధారపు పంట, నీటి వసతి ఉన్నట్లయితే పుత దశలో ఒక తడి,కాయదశలో మరోసారి నీటి తడి ఇచ్చుకుంటే అధిక దిగుబడులను పొందవచ్చు.నీటి తడులు పెట్టెటతప్పుడు నీరు నిలవకుండా చూడాలి .
సస్యరక్షణ చర్యలు:
ఎండు తెగులు: ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి .కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి.మొక్కలు గుంపులు, గుంపులుగా చనిపోవును. తెగులు నివారణకు
3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచే విధంగా పోసుకోవాలి.
వేరుకుళ్ళు తెగులు :
తెగులు సోకిన మెక్కల ఎండిపోయి పొలమంతా అక్కడక్కడ కనబడతాయి.వేరు కుళ్ళు రాకుండా ఉండడానికి ఒక కిలో విత్తనంకు 3గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ మందును కలిపి విత్తుకోవాలి.దీన్ని నివారించాలంటే కార్బండిజమ్,మాంక్‌జెట్ మిశ్రమాన్ని 400 గ్రాములు ఒక ఎకరాకు, మొక్క మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి
ఆకుమాడు తెగులు, తడి వేరు కుళ్లు తెగులు:
అధిక వర్షాలకు శనగలోఆశించే అవకాశం ఉంది. ఆకుమాడు తెగులు వల్ల ఆకుల మీద వలయాకారపు మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరిగి ఆకులు ఎండి రాలిపోతాయి. దీని నివారణకు హెక్సావేనజోన్ 400 మిల్లీలీటర్లు, ప్రోపికొనజోన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోథాలోనిల్ 400 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేయాలి
శనగపచ్చ పురుగు : ఇది లద్దే పురుగు దశలో పూతను ,కాయలను నష్టపరుస్తాయి.
సీతాకోక చిలక దశలో పూత పైన ,కాయలపైన గ్రుడ్లును ఒక్కోకటిగా పెడుతుంది .గ్రుడ్ల నుండి వచ్చిన పురుగు కాయలను తొలిచి గింజలను తింటుంది .నివారణకు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.౦ మి.లీ. లేక క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.0గ్రా .చొప్పున పూత ,పిందె దశల్లో 10 రోజుల వ్యవధిలో మందులను మర్చి రెండు ,మూడు సార్లు పిచికారి చేయాలి .
Share your comments