Agripedia

వెంటిలేటెడ్ పోలిహౌస్ కూరగాయల సాగులో వచ్చే తెగుళ్లు యాజమాన్య పద్ధతులు....

KJ Staff
KJ Staff

ప్రస్తుత రోజుల్లో కూరగాయలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మారుతున్న కాలానికి అనుగుణంగా సంవత్సరం పొడవునా బయటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా వెంటిలేటెడ్ పోలిహౌస్లో సంవత్సరం పొడవునా అధిక నాణ్యమైన క్యాప్సికం ,టమోటా వంటి కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.సాధారణంగా వెంటిలేటెడ్ పాలిహౌస్ లో తెగుళ్ల ఉద్ధృతి చాలా తక్కువగా వుండి.తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతోనే నివారించుకోవచ్చు.

బూడిద తెగులు : శీతాకాలంలో ఈ తెగులు సోకుతుంది.మొక్కలు ఏపుగా పెరిగేటప్పుడు వాతావరణంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండి ఇ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులుగా ఉంటే బూడిద తెగులు ఆశిస్తుంది ఈ తెగులు ఆశించిన మొక్కల ముదురు, లేత ఆకులవెనుక భాగము, బూడిద వర్ణంలోకి మారి, ఆకులు పండుబారి రాలిపోతాయి. కాయల ఆకారము మారి, రంగు తగ్గి, రాలిపోయే అవకాశము కలదు. దీని నివారణకు బెనోమిల్ 1.5గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించవచ్చు. ఉష్ణోగ్రతలలో మార్పు వచ్చినపుడు పాలిహౌస్లో పరదాలను మూసి తెరవడము ద్వారా కూడా బూడిద తెగులును నివారించవచ్చు.

ఎర్రనల్లి : మొక్కలు లేత దశలో ఎక్కువగా ఆశిస్తుంది. లేత ఆకులపై చేరి ఇ రసం పీల్చడం వలన ఆకులు ముడుచుకొని మొక్క నాణ్యత కోల్పోతుంది.దీని నివారణకు ఓమైట్ 1.25 మి.లీ. లేదా స్నైపర్ 2,5 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు: సరైన ఎరువుల యాజమాన్యం పాటించకుంటే ఈ పురుగులు ఆశించి ప్రమాదం ఉంది. ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే తామర పురుగులు లేత ఆకులు, కొనల పై ఆశించి రసము పీల్చడము ద్వారా కొనలు ఎండిపోయి మొక్క పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి దీని నివారణకు మొక్కల తలలు కత్తిరించి షిప్రొనిల్ 1.5 మి.లీ లేదా ఎస్-కౌంటర్ 1 మి.లీ. మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించవచ్చు.

Share your comments

Subscribe Magazine